భారీగా పెరిగిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెయింటింగ్ పీరియడ్

By Ravi

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా తాజాగా దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న సంగతి తెలిసినదే. అయితే, ప్రస్తుతం ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌కు ఉత్పత్తికి మించి డిమాండ్ ఉండటంతో ఒక్కొక్క ఏరియాలో ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా పెరిగిపోతుంది.

కొత్తగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ విడుదల చేసినప్పుడు, అలాగే మహీంద్రా తమ కొత్త ఎక్స్‌యూవీ500ను విడుదల చేసినప్పుడు నెలకొన్ని పరిస్థితే ఈకోస్పోర్ట్ విషయంలోను ఏర్పడింది. ఆకర్షనీయమైన డిజైన్, మెరుగైన ఫీచర్లు, సరమైన ధరలతో ఇది విడుదల కొనుగోలుదారులను తొలిచూపులోనే ఆకట్టుకుంటోంది.

మరోవైపు డీజిల్ మోడళ్లలో గ్లో ప్లగ్ మ్యాడ్యూల్ సమస్య కారణంగా కంపెనీ రీకాల్‌ను ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కొన్ని రకాల డీజిల్ మోడళ్లకు వెయిటింగ్ పీరియడ్ రెండు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు ఉంటుంది.

స్థానిక డీలరు తెలిపిన సమాచారం ప్రకారం, ఎంట్రీ లెవల్ డీజిల్ వేరియంట్ (ఆంబీంట్) ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్ 2 నెలలుగా ఉంటే, ట్రెండ్ వేరియంట్ కోసం 3 నెలలు, టైటానియం మరియు టైటానియం ఆప్షనల్ వేరియంట్ల కోసం సుమారు 9 నెలల వెయింటింగ్ పీరియడ్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగని పెట్రోల్ వెర్షన్ ఈకోస్పోర్ట్ త్వరగానే లభిస్తుందా అంటే, దీని వెయింటింగ్ పీరియడ్ కూడా భారీగానే ఉంటోంది.

Ford EcoSport

ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం తాజాగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను బుక్ చేసుకునే వారు మాత్రం ఈ మోడల్‌ను సొంతం చేసుకోవాలంటే మరికొద్ది నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈకోస్పోర్ట్ మార్కెట్లో విడుదలైన మొదటి 17 రోజుల్లోనే 30,000 బుకింగ్‌లను సొంతం చేసుకొని మార్కెట్లో రికార్డు సృష్టించిన సంగతి తెలిసినదే.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విషయానికి వస్తే, ఇది మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. అందులో ఒకటి 1.5 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 112 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది.

డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్, 4-సిలిండర్ డీజిల్ గరిష్టంగా 91 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్ ఈకోస్పోర్ట్‌ మాత్రం 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 125 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో కూడా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

Most Read Articles

English summary
The Ford EcoSport compact SUV waiting period has gone up by nine months depending on the variant. Ambient, Trend variants waiting period is nearly two to three months. The fully loaded Titanium and Titanium Option variants have a waiting period of nine months.
Story first published: Monday, July 22, 2013, 15:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X