టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన ఫోర్డ్ ఫిగో కాంపాక్ట్ సెడాన్

By Ravi

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ మరియు త్వరలో టాటా మోటార్స్ నుంచి రానున్న ఫాల్కన్ 5 కాంపాక్ట్ సెడాన్లకు పోటీగా మరో కొత్త కాంపాక్ట్ సెడాన్ రాబోతుంది. ఈ కొత్త కాంపాక్ట్ సెడాన్‌ను తయారు చేస్తోంది ఎవరనుకుంటున్నారా..? అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్స్.

ఫోర్డ్ మోటార్స్ అందిస్తున్న చిన్న కారు ఫిగో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ కాంపాక్ట్ సెడాన్ కారును తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన రహస్య చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. (స్పై షాట్‌ను క్రింది ఫొటోలో చూడొచ్చు).

Ford Figo

అభివృద్ధి చెందుతున్న ఇండియా, బ్రెజిల్ వంటి మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని ఫోర్డ్ మోటార్స్ ఈ ఎంట్రీ లెవల్ సెడాన్ కారును తయారు చేస్తోంది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి మోడళ్లు మంచి సక్సెస్‌ను సాధించిన నేపథ్యంలో, ఈ సెగ్మెంట్లో ఫోర్డ్ కూడా తమ సక్సెస్ స్టోరీని క్రియేట్ చేయాలని చూస్తోంది.

ఈ స్పై షాట్‌ను బట్టి చూస్తుంటే, ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకోనున్న ఈ కాంపాక్ట్ సెడాన్ కూడా నాలుగు మీటర్ల (సబ్-ఫోర్ మీటర్) పొడవు తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 2015 నాటికి ఇది ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇండియన్ వెర్షన్ ఎక్స్టీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కానీ మొత్తం డిజైన్ మాత్రం మారదని తెలుస్తోంది.


ఇదిలా ఉండగా.. ఫోర్డ్ అందిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ఫిగోలో కూడా ఓ నెక్స్ట్ జనరేషన్ వెర్షన్‌‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఇది కూడా టెస్టింగ్ దశలో ఉంది. బహుశా ఈ రెండు మోడళ్లు ఒకేసారి భారత మార్కెట్లో విడుదలైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ప్రస్తుతం లభిస్తున్న ఇంజన్లతో పాటుగా అనేక అవార్డులు గెలుచుకున్న 1.0 లీటర్ ఫోర్డ్ ఈకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఈ కార్లలో ఉపయోగించవచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.
Most Read Articles

English summary
US auto major Ford Motors is planning to launch a small entry level sedan that is based on the Ford Figo. It looks like the company has been working on the entry level sedan that is targeted to emerging markets like Brazil and India.
Story first published: Wednesday, November 13, 2013, 10:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X