2017 నాటికి 70 శాతం మోడళ్లలో స్టార్ట్-స్టాప్ ఫీచర్: ఫోర్డ్

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్, తమ 'బ్లూప్రింట్' అనే ప్రణాళికలో భాగంగా, 2017 నాటికి కంపెనీ అమెరికాలో విక్రయిస్తున్న 70 శాతం ఉత్పత్తుల్లో ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని ఆఫర్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ టెక్నాలజీ వలన మైలేజ్ దాదాపు 10 శాతం మేర పెరగటమే కాకుండా, పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. కానీ, దురదృష్టవశాత్తు ఫోర్డ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏ వాహనంలో ఆటో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని ఆఫర్ చేయటం లేదు.

అయితే, మనదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఈ టెక్నాలజీని ఇప్పటికే తమ పాపులర్ స్కార్పియో, ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలలో ఆఫర్ చేస్తుంది. అయితే, మహీంద్రా ఈ టెక్నాలజీని 'మైక్రో హైబ్రిడ్' అని పిలుస్తోంది. పేరు ఏదైనప్పటికీ ఈ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే. మైలేజ్‌ను పెంచటం, కాలుష్యాన్ని తగ్గించటం.

Ford Car

వాహనంలో ఈ సిస్టమ్‌ను అమర్చడం వలన ఇంజన్ ఐడిల్‌గా ఉండటాన్ని ఇది గుర్తించి ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆఫ్ అయ్యేలా చేస్తుంది. మళ్లీ తిరిగి క్లచ్‌ను నొక్కగానే ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. సుదీర్ఘ ట్రాఫిక్ జామ్స్, ఎక్కువ సేపు వేటి ఉండాల్సిన ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి పలు పరిస్థితుల్లో ఇంజన్ ఐడిల్‌గా ఉంచాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇంజన్‍ను రన్నింగ్ (ఆన్)లో ఉంటడం వలన ఇంధనం వృధా అవటమే కాకుండా, వానాల నుంచి వెలువడే కర్భన ఉద్ఘారాల వలన పర్యావరణ కాలుష్యం కూడా జరుగుతుంది.

కాగా.. వాహనాల్లో ఈ ఆటో స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌ను అమర్చడం వలన ఇంజన్ ఐడిల్‌గా ఉండటాన్ని ఇది గుర్తించి నిర్ధిష్ట సమయం (బహుశా 30 సెకండ్లు లేదా 1 నిమిషం) తర్వాత ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా చేసి ఇంధనం వృధా కాకుండా చేస్తుంది. దీని వలన కేవలం ఇంధనం మాత్రమే ఆదా కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.

Most Read Articles

English summary
Ford, under its Blueprint for Sustainability initiative, has announced it will introduce Auto Start/Stop technology in 70 percent of its cars by the year 2017 in the United States.
Story first published: Monday, December 16, 2013, 16:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X