లక్ష రూపాయల కారుకు ప్రాణం పోసిన 'ఘనుడు'

By Ravi

లక్ష రూపాయల కారుగా ప్రపంచ రికార్డు సాధించిన 'టాటా నానో' కారుకు బీజం వేసింది వేసింది రతన్ టాటా అయితే, ఆ కారుకు ప్రాణం పోసింది మాత్రం ఓ యువ ఇంజనీర్. మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేయాలంటూ రతన్ టాటా తలపెట్టిన ప్రతిష్టాత్మక టాటా నానో ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన వారిలో ప్రముఖ ఆటోమొబైల్‌ ఇంజినీర్ గిరీష్ వాగ్ అతిముఖ్యుడు.

జూన్‌ 2005 రతన్‌ టాటా లక్ష రూపాయల కారు ఆలోచనను వెల్లడించి ఏడాదిన్నర గడిచిపోయింది. ఆ ప్రాజెక్టు కోసం అప్పటికే ఓ నిపుణుల బృందం పని చేస్తోంది. అయితే, కారు సంబంధించిన రూపురేఖలు సిద్ధం కాలేదు. ఉద్యోగుల అంతర్గత చర్చల్లో 'లక్ష కారు... ఓ కల మాత్రమే' అన్న గుసగుసలు ఎక్కువగా వినిపించేవట. సరిగ్గా ఆ సమయంలో గిరీష్‌ వాగ్‌ని అదృష్టం తలుపు తట్టింది.

రతన్ టాటా గిరీష్ వాగ్‌ను పిలిపించి, ఈ కారు డిజైన్ బాధ్యతలను స్వీకరించాలని, 30 నెలలో వ్యవధిలో దీనిని పూర్తి చేయాలని కోరారు. దీనికి మీరు సిద్ధమేనా గిరీష్ వాగ్‌ను అడగగానే, అతను మారు మాట్లాడుకుండా సరే అన్నాడు. నిజానికి గిరీష్‌కు ఇదొక పెద్ద ఛాలెంజ్. కారు రూపకల్పనలో అతనికి అంత అనుభవం లేదు. అయితే, ఏదైనా ఒక పని తనకు అప్పగిస్తే, ఎట్టి పరిస్థితిల్లోను విడిచిపెట్టకుండా, పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేసే సత్తా గిరీష్‌కు ఉంది.

పదహారేళ్ల క్రితం టాటా మోటార్స్‌లో ఉద్యోగిగా చేరినప్పుడు గిరీష్‌ ఈ చారిత్రాత్మక కారు రూపకల్పనలో భాగం పంచుకుంటానని కలలో కూడా ఊహించలేదు. అయితే, పదేళ్ల క్రితం మొదటిసారి 'ఇండికా' తయారీలో గిరీష్ భాగస్వామి అయ్యాడు. అప్పుడే అతనిలోని అసమాన ప్రతిభాపాటవాలు ఉన్నాయని కంపెనీ ఉన్నతాధికారులు గుర్తించారు. టాటా ఏస్ పికప్‌ ట్రక్కును డిజైన్ చేసింది కూడా ఆయనే. 2005లో వచ్చిన ఈ ట్రక్కు విజయం సాధించడంతో కంపెనీలో గిరీష్ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

Tata Nano Girish

టాటా నానో తయారీ పెను సవాళ్లతో కూడుకున్నది. ఈ కారు డిజైన్ ఆకర్షనీయంగా ఉండాలి, నాణ్యమైన విడి భాగాలు వాడాలి, లక్ష రూపాయల్లోపే అందించాలి, సంస్థలోని అందరి విజ్ఞానాన్ని సమీకరించాలి, తరచూ మారే డిజైన్‌కి అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి, తక్కువ బరువు, ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం, యూరో ప్రమాణాలకు దీటుగా రూపొందించాలి. వీటిన్నింటినీ గిరీష్ చక్కగా నిర్వహించగలిగాడు.

అప్పటికే టాటా నానో కారుపై అనేక విమర్శలు గుప్పుమన్నాయి. గిరీష్ ఆ వ్యాఖ్యలన్నింటినీ పూర్తి చేసి, 500 మంది సిబ్బందితో కలిసి నానో కారు తయారు చేసి చూపించాడు. ఈ లక్ష రూపాయల కారు నిజం చేయటంలో గిరీష్ వాగ్ పాత్ర అత్యంత కీలకమైనది టాటా మోటార్స్ అధినేత రతన్ టాటా అప్పట్లో గిరీష్ వాగ్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. నేటి మన నానో వెనుక నాటి గిరీష్ కష్టం ఎంతో ఉంది. ఈ రోజు మార్కెట్లో నానో సక్సెస్ అయినా కాకపోయినా గిరీష్ మాత్రం తన వృత్తిలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. మీరేమంటారు..?

Most Read Articles

English summary
Girish Wagh is the key person in the Tata Nano one lakh rupees car project. He designed the Nano. When he first joined Tata Motors 16 years ago, Girish Wagh had no idea he would one day head the company's now-legendary Rs 1-lakh car project. Here is the small intro of this legend car designer.
Story first published: Monday, July 22, 2013, 17:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X