4000 చెవర్లే సెయిల్ కార్లను రీకాల్ చేసిన జిమ్ ఇండియా

By Ravi

ఇటీవలే 1.4 లక్షల యూనిట్ల చెవర్లే తవేరా ఎమ్‍‌పివిలను రీకాల్ చేసిన అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా, ఇప్పుడు తాజాగా 4000 చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లను రీకాల్ చేసింది. వీటి ఇంజన్‌లో గుర్తించిన సమస్య కారణంగానే ఈ కార్లను రీకాల్ చేస్తున్నామని, ఇది సేఫ్టీ సంబంధిత అంశం కాదని కంపెనీ స్పష్టం చేసింది.

అంతేకాకుండా, సెయిల్‌లోని ఇంజన్ సమస్యకు చెవర్లే తవేరా బిఎస్3, బిఎస్4 ఇంజన్లతో ఎదుర్కున్న సమస్యలకు ఎలాంటి పోలిక లేదని కూడా కంపెనీ పేర్కొంది. నాణ్యత విషయంలో తమ కట్టుబాటుతనం మరియు వినియోగదారులను తృప్తిపరచే అంశాల్లో భాగంగా 4000 యూనిట్ల డీజిల్ వెర్షన్ చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్, నాచ్‌బ్యాక్ (కాంపాక్ట్ సెడాన్) కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Chevrolet Sail

మేము చేసే ప్రతి పనికి కస్టమర్లే కేంద్రం, నాణ్యతకే మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము. ఏదైనా సమస్య గుర్తిస్తే, మా వైపు నుంచి దానిని వీలైనంత త్వరగా సరిచేసి, వినియోగదారుల సంతృప్తి కోసం తమ కట్టుబాటుతనాన్ని పూర్తి చేస్తామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్-ప్రెసిడెంట్ పి బాలేంద్రన్ తెలిపారు.

నాణ్యత సమస్యల దృష్ట్యా జూన్ 3 నుంచి జనరల్ మోటార్స్ చెవర్లే సెయిల్ మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే, ఇప్పుడు ఈ సమస్యను సరిచేసి, తిరిగి ఉత్పత్తిని ప్రారంభించారు. కాగా.. ఇప్పటికే ఈ సమస్య వల్ల ప్రభావితమైన డీజిల్ వెర్షన్ సెయిల్ కార్లను దేశవ్యాప్తంగా కంపెనీకు ఉన్న అధీకృత డీలర్‌షిప్ కేంద్రాల్లో ఉచితంగా సరిచేస్తామని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
GM India is not done with recalling its vehicles. Post the massive recall of 1.14 lakh Tavera MPVs in July the automaker has now issued a recall of the diesel variants of Sail hatchbacks and compact sedans. A total of 4000 units are affected.
Story first published: Tuesday, September 3, 2013, 11:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X