తవేరా రీకాల్: జిఎమ్ ఇండియాకు రూ.3.4 కోట్ల జరిమానా

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌కు భారత్‌లోని చెవర్లే తవేరా ఎమ్‌పివి రీకాల్ పెద్ద తలనొప్పిగా మారింది. జనరల్ మోటార్స్ ఇండియా గడచిన 2005లో చెవర్లే తవేరా ఉత్పత్తిని ప్రారంభించింది. దీని తయారీలో కాలుష్య నిబంధనల విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకపోవటం కారణంగా, ప్రస్తుత నిబంధనలు ఇవి పాటించకపోవటంతో భారత ప్రభుత్వం సదరు కంపెనీ నుంచి సుమారు రూ.3.4 కోట్ల వరకు జరిమానా పడే ఆస్కారం ఉంది.

ఒరిజినల్ ఇంజన్ స్పెసిఫికేషన్లను సర్టిఫికెట్‌లో వేరుగా చూపించడం వలన ఈ సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో రవాణా శాఖా గుర్రుగా ఉంది. అందుకే జనరల్ మోటార్స్ ఇండియాపై భారీ జరిమానా విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కాగా.. కంపెనీలోని అంతర్గత కారణాల వల్లే ఈ లోపాలు జరిగాయని గుర్తించిన జనరల్ మోటార్స్ తమ యూఎస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సీనియర్ ఆర్ అండ్ డి అధికారులు పదవుల నుంచి తప్పుకున్న తర్వాత భారత ప్లాంటులోని ఉద్యోగులపై కూడా వేటు వేసింది.

భారత్‌లో కార్యకాలాపాలు నిర్వహిస్తున్న 30-35 మంది కీలక ఎగ్జిక్యూటివ్‌లను కంపెనీ విధుల నుంచి తొలగించి వేసింది. మహారాష్ట్రలోని తాలేగావ్, గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని కార్పోరేట్ ఆఫీసులలో ఉన్న డజన్ల కొద్ది అధికారులపై కంపెనీ వేటు వేసినట్లు తెలుస్తోంది.

Tavera Green

భారత మార్కెట్లో 2005వ సంవత్సరం నుంచి 2013వ సంవత్సర మధ్య కాలంలో విక్రయించిన, సుమారు లక్ష యూనిట్లకు పైగా చెవర్లే తవేరా వాహనాలలో కాలుష్య నిబంధనల సంబంధిత సమస్యలను గుర్తించామని, అందుకే వాటిని వెనక్కు పిలిపిస్తున్నామని జనరల్ మోటార్స్ గతంలో ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసినదే. చెవర్లే ఎమ్‌పివిలలో ఎమిషన్స్, స్పెసిఫికేషన్ సమస్యలకు సంబంధించి జనరల్ మోటార్స్ ఈ రీకాల్‌ను జారీ చేసింది.

భారతదేశంలో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు చేసిన అతిపెద్ద రీకాల్‌‌‌లలో చెవర్లే తవేరా రీకాల్ కూడా ఒకటి కావటంతో కంపెనీ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యల కారణంగా జనరల్ మోటార్స్ ఇప్పటికే తవేరా ఉత్పత్తి నిలిపి వేసింది. తవేరా భారత్ స్టేజ్ 3 (2.5 లీటర్ వేరియంట్)లో ఎమిషన్ (కాలుష్య) సమస్యలు, తవేరా బిఎస్ 4 (2.0 లీటర్ వేరియంట్)లో స్పెసిఫికేషన్ సమస్యలు ఉన్నట్లు జనరల్ మోటార్స్ వివరించింది.

Most Read Articles

English summary
Seems General Motors India's troubles over the fudging of Tavera emission details have just started as the Indian Transport Ministry initiates action against the U.S carmaker. TOI reports that GM India could be fined at least INR 3.4 crores. This is going by Rs 100 for the first offence and Rs 300 for subsequent offences.
Story first published: Wednesday, August 7, 2013, 14:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X