బ్రేక్ ఫెయిల్యూర్: మూడు లక్షల చెవర్లే క్రూజ్ కార్లు రీకాల్

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌కు షాక్ మీద షాక్ తగులుతోంది. చెవర్లే తవేరా సమస్య రీకాల్ సమసిపోక ముందే, జిఎమ్‌కు మరొక సమస్య ఎదురైంది. గ్లోబల్ మార్కెట్లలో కంపెనీ విక్రయిస్తున్న చెవర్లే క్రూజ్ సెడాన్‌లో కూడా తయారీ లోపాలున్నట్లు గుర్తించారు.

ఓహియో రాష్ట్రంలోని లార్డ్స్‌టౌన్‌లో 2011 నుంచి 2012 మధ్య కాలంలో ఉత్పత్తి చేసిన చెవర్లే క్రూజ్ కార్లలో పవర్-అసిస్టెడ్ బ్రేక్స్ సమస్య వలన జనరల్ మోటార్స్ అమెరికాలో సుమారు 2,93,000 క్రూజ్ మోడళ్లను రీకాల్ చేసే ఆస్కారం ఉందని డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ పేర్కొంది.

రీకాల్ చేయబడిన చెవర్లే క్రూజ్ కార్లలో 1.4 లీటర్ టర్బోఛార్జ్‌డ్ గ్యాసోలైన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. పవర్-అసిస్టెడ్ బ్రేక్స్ సమస్య కారణంగా బ్రేక్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Chevrolet Cruze

ఈ సమస్య వలన పవర్ బ్రేక్ బూస్టర్స్ ఫెయల్ అయ్యి, బ్రేక్‌ను వేసేందుకు డ్రైవర్లు బ్రేక్ పెడల్స్‌పై ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ బ్రేక్ సమస్య వల్ల ఇప్పటి వరకూ 27 ప్రమాదాలు (లో స్పీడ్ క్రాషెస్) నమోదయ్యాయని, అయితే ఈ ప్రమాదాల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదని జనరల్ మోటార్స్ కంపెనీని ఉటంకిస్తూ డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ పేర్కొంది.

ఇదిలా ఉండగా, జనరల్ మోటార్స్‌కు చెందిన భారతదేశపు విభాగం జనరల్ మోటార్స్ ఇండియా, ఇక్కడి మార్కెట్లో విక్రయించిన ఎమ్‌పివి తవేరాలో కాలుష్య నిబంధనలకు సంబంధించిన సమస్యల నేపథ్యంలో సుమారు 1.4 లక్షలకు పైగా వాహనాలను రీకాల్ చేసిన సంగతి తెలిసినదే.

Most Read Articles

English summary
Auto major General Motors is recalling nearly 2,93,000 Chevrolet Cruze cars in US over a brake-related problem.
Story first published: Monday, August 19, 2013, 12:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X