వాహన రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 6 శాతానికి పరిమితం చేయనున్న సర్కార్

By Ravi

ఇకనుంచి వాహన కొనుగోలుదారులు, తాము కొనుగోలు చేసే వాహన ధరలో ఆరు శాతాన్ని లైఫ్‌టైమ్ టాక్స్ (జీవిత కాలపు పన్ను లేదా రిజిస్ట్రేషన్‌ ఫీజు)గా వసూలు చేసేందుకు ఢిల్లీ సర్కారు సుముఖంగా ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో లైఫ్‌టైమ్ టాక్క్‌ను విభిన్న రకాలు అమలు చేస్తున్నారు. అయితే, ఇక నుంచి ఈ పన్నును అన్ని రాష్ట్రాల్లో సమానంగా వసూలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.

ద్విచక్ర వాహనాలు, కార్లు, లైట్‌ మోటార్‌ వెహికల్స్‌ (ఎల్‌ఎమ్‌వి) కొనుగోలు ధరపై 6 శాతం కనీస లైఫ్‌ టైమ్‌ టాక్స్‌ వసూలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. బుధవారం రవాణా అభివృద్ధి మండలి సమావేశం తర్వాత రవాణా శాఖ కార్యదర్శి విజయ్‌ చిబ్బర్‌ ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. ఈ మండలిలో అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా కమిషనర్లు సభ్యులుగా ఉన్నారు.

New Car

అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న తాజా నిర్ణయం వలన, ప్రస్తుతం అధిక పన్ను వసూలు చేస్తున్న కొన్ని రాష్ట్రాల ఆదాయాలకు గండి పడనుంది. అనేక మార్లు ఈ అంశంపై చర్చించిన తర్వాత, రాష్ట్రాల మధ్య ఉమ్మడి పన్ను విధానం అమలు చేయడం సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చామని, అందుకే ప్రతి ఒక్కరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కనీస పన్ను రేటును ఖరారు చేశామని చిబ్బర్‌ వెల్లడించారు.

ఒకవేళ భారత ప్రభుత్వం ఉమ్మడి పన్ను విధానం అమల్లోకి తీసుకువచ్చినట్లయితే, కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం కోల్పోతుంది కాబట్టి, ఫలితంగా సర్కారు కూడా ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కానీ ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వమే రూపొందించిందని, కేంద్ర పాలిత ప్రాంతాలు కనీస లైఫ్‌టాక్స్‌ విధానానికి సమ్మతించినా, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దీన్ని అమలు చేయరాదని కోరుతున్నాయని చిబ్బర్ తెలిపారు.

వాస్తవానికి కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాహన రిజిస్ట్రేషన్ ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి, కానీ రాష్ట్రాల్లో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ, మెజారిటీ సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నట్లు సమాచారం.

Most Read Articles

English summary
The government on Wednesday favoured a levy of a minimum 6 per cent of the sale price of the vehicle as a lifetime tax by various states. Ministry of road transport and highways today recommended all the states should levy a lifetime tax at floor rate of 6 per cent of the sale price of the 2-wheelers, cars and LMVs (light motor vehicles).
Story first published: Thursday, October 24, 2013, 14:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X