ర్యాపిడ్ కొంటే ఫ్యాబియా ఫ్రీ: గుజరాత్ డీలర్ జిమ్మిక్

By Ravi

ఒకటి కొంటే మరొకటి ఉచితం ఆఫర్ ఇప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమకు పాకింది. ఒక కారు కొంటే మరొక కారు ఫ్రీ అంటున్నాడు గుజరాత్‌కు చెందిన ఓ స్కొడా డీలర్. గుజరాత్‌లోని టార్క్ ఆటో అనే స్కొడా డీలర్ స్కొడా ర్యాపిడ్ సెడాన్‌ను కొనుగోలు చేస్తే స్కొడా ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్ ఉచితం అంటూ కొనుగోలుదారులను ఊరిస్తున్నాడు. అయితే, ఈ ఉచిత ఫ్యాబియా కారును మాత్రం సదరు ఇప్పుడే ఇవ్వడట. ఐదేళ్ల తర్వాత ఫ్యాబియా కారును కానీ లేదా అంతకు సమానమైన డబ్బును కానీ ఇస్తాడట.

ఐదేళ్ల తర్వాత ఈ ఉచిత ఫ్యాబియా కారును పొందే కస్టమర్లు అన్ని పన్నులను (వ్యాట్, రోడ్ టాక్స్ మొదలైనవి), బీమా (ఇన్సూరెన్స్)ను తామే భరించాల్సి ఉంటుంది. కానీ, ఇందులో వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం కస్టమర్‌కు లేదు. కేవలం ఎంట్రీ లెవల్ (ప్రారంభ) వేరియంట్‌ను మాత్రమే సదరు డీలర్ ఆఫర్ చేస్తున్నాడు. అయితే, కస్టమర్లు పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుందట. ఒకవేళ ఐదేళ్ల తర్వాత ఫ్యాబియా కారు వద్దనుకునేవారు 2018లో రూ.3,50,000 నగదును డీలర్ నుంచి తీసుకోవచ్చు.

చూస్తుంటే, సదరు డీలర్ వద్ద ర్యాపిడ్ లేదా ఫ్యాబియా స్టాక్ అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గడచిన కొద్ది నెలలుగా గమనిస్తే ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇవి గరిష్టంగా నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ అమ్ముడుపోవటం లేదు. ఈ నేపథ్యంలో తన వద్ద పేరుకుపోయిన స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు టార్క్ ఆటో డీలర్ ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆఫర్ బాగానే ఉన్నప్పటికీ ఇది, దీనిని రన్ చేసేందుకు స్కొడా కంపెనీ సదరు డీలర్‌ను ఎలా అనుమతించిందో.

గతంలో కూడా పలు కంపెనీలు, డీలర్లు ఇలాంటి ఆఫర్లను ప్రకటించిన దాఖలాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఆఫర్ వలన ఫ్యాబియా, ర్యాపిడ్‌ల బ్రాండ్ నేమ్ దెబ్బతినే అవకాశం ఉందని ఆటో విశ్లేషకులు భావిస్తున్నారు. మీరేమంటారు..?

Rapid Fabia Offer
Most Read Articles

English summary
A Skoda Dealer From Gujarat has introduced a unique offer. Torque Auto is offering a Fabia for free on the purchase of Rapid. However, the dealer will give you the Fabia after 5 years. But all taxes (including VAT, road tax etc.) and insurance will be borne by the owner. If customer don't want the car, he can have cash instead of the car.
Story first published: Thursday, February 28, 2013, 11:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X