వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న అంబాసిడర్ హ్యాచ్‌బ్యాక్

భారతదేశపు అత్యంత పురాతన కారు 'అంబాసిడర్' ఇకపై కొత్త అవతారంలో కనిపించనుంది. చిన్న కార్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని, అలాగే ఎక్సైజ్ సుంకపు రాయితీలను పొందేందుకు గాను, సికె బిర్లా గ్రూపుకు చెందిన హిందుస్థాన్ మోటార్ కంపెనీ ఓ అంబాసిడర్ హ్యాచ్‌బ్యాక్‌ను మరియు అంబాసిడర్ కాంపాక్ట్ సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న అంబాసిడర్ సెడాన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ కొత్త కార్లను తయారు చేయనుంది.

హిందుస్థాన్ మోటార్స్ గత రెండేళ్ల క్రితమే అంబాసిడర్ హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ విడుదల గురించి ఓ ప్రకటన చేసింది. అయితే, వివిధ కారణాల వలన అది ఉత్పత్తి దశకు చేరుకోలేకపోయింది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ అభివృద్ధి చేయనున్న అంబాసిడర్ హ్యాచ్‌బ్యాక్ కారు 2014 చివరి నాటికి దేశీయ విపణిలో అందుబాటులోకి రానుంది. అయితే, హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ అంబాసిడర్ కంటే ముందుగా కాంపాక్ట్ సెడాన్ వెర్షన్ అంబాసిడర్ విడుదలయ్యే సూచనలు కనిపిన్నాయి.

HM Ambassador

ప్రస్తుతం హిందుస్థాన్ మోటార్స్‌కు పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఉత్తర్‌పురా ఫ్యాక్టరీలోనే ఈ కొత్త కార్లను ఉత్పత్తి చేయనున్నారు. కొత్త కార్లలో ఉపయోగించే ఇంజన్లను కూడా రీట్యూన్ చేసి ఆధునిక కాలుష్య నిబంధనలు పాటించేలా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కాగా.. అంబాసిడర్ కారు అమ్మకాలు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. గడచిన ఫిబ్రవరి నెలలో హిందూస్థాన్ మోటార్స్ 826 అంబాసిడర్ కార్లను విక్రయించి అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే 166.45 శాతం వృద్ధని కనబరిచింది.

అంబాసిడర్ కారు అమ్మకాలు జోరందుకోవటంతో కంపెనీ తమ తాజా ప్రణాళికకు జీవం పోసినట్లు తెలుస్తోంది. హిందుస్థాన్ మోటార్స్ ఎమ్‌డి, సీఈఓ ఉత్తమ్ బోస్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) పనులు జరుగుతున్నాయని, తమ అంబాసిడర్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్ దశలో ఉందని, ఇది అన్ని రకాల ఫీచర్లతో నవతరం వినియోగదారులు కోరుకునేలా ఉంటుందని ఆయన అన్నారు.

Most Read Articles

English summary
The CK Birla group’s Hindustan Motors is planning to launch a new-age hatch-back version of the iconic Ambassador car. "We have just started the R&D work. This hatchback version of the Ambassador will have all kinds of features and better interior, which a new-age customer looks for," Uttam Bose, MD & CEO of HM said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X