హోండా అమేజ్ ఎఫెక్ట్: నవంబర్‌లో అమేజింగ్ సేల్స్

By Ravi

హోండా కార్స్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన మొట్టమొదటి డీజిల్ కారు హోండా అమేజ్, దేశీయ విపణిలో అద్భుతాలు చేస్తోంది. కంపెనీ ఊహించని రీతిలో సక్సెస్‌ను తెచ్చిపెట్టిన ఈ మోడల్, ప్రస్తుతం కంపెనీ నుంచి అమ్ముడుపోతున్న టాప్ మోడల్‍‌గా నిలిచింది. గడచిన నవంబర్ నెలలో హోండా కార్స్ ఇండియా అమ్మకాలు ఏకంగా 151 శాతం వృద్ధి చెందాయి.

ఈ సక్సెస్‌కు కారణం హోండా అమేజ్ మోడలేనని కంపెనీ పేర్కొంది. గడచిన సంవత్సరం నవంబర్ నెలలో దేశీయ విపణిలో కేవలం 3,711 యూనిట్లను మాత్రమే విక్రయించిన హోండా, ఈ నవంబర్ నెలలో మొత్తం 9,332 వాహనాలను విక్రయించింది. ఇదే సమయంలో కంపెనీ 806 వాహనాలను ఎగుమతి కూడా చేసింది.

Honda Amaze

ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి నవంబర్ 2013 నెలకు చూస్తే, హోండా మొత్తం అమ్మకాలు మునుపటి సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే 70 శాతం వృద్ధి చెంది 47,236 యూనిట్ల నుంచి 80,163 యూనిట్లకు పెరిగాయి.

నవంబర్ 2013లో హోండా మొత్తం 9,332 వాహనాలను విక్రయిస్తే, అందులో 7,598 యూనిట్లు హోండా అమేజ్ కార్లు కావటం విశేషం. మిగిలిన వాటిల్లో హోండా బ్రయో (1,712), సిఆర్-వి (22) మోడళ్లు ఉన్నాయి.

హోండా కార్స్ ఇండియా ఇటీవలే తమ డీజిల్ వెర్షన్ సిటీ సెడాన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఈ కొత్త సిటీతో హోండా అమ్మకాలు మరింత పెరిగే ఆస్కారం ఉంటుంది.

Most Read Articles

English summary
Honda Cars India has registered an amazing sales growth figure of 151 percent during the month of November 2013. The Japanese automaker sold a healthy 9,332 vehicles locally during the month. That's a huge improvement over the 3,711 units sold in the corresponding month last year. The company also exported 806 units in November.
Story first published: Saturday, December 7, 2013, 11:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X