విడుదలకు ముందే 2000 యూనిట్లకు పైగా బుకింగ్స్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా నుంచి రానున్న హోండా అమేజ్ సెడాన్ కోసం కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ కారు గురించి ధర, ఫీచర్లు తదితర పూర్తి వివరాలు తెలుసుకోకుండా అమేజ్ సెడాన్‌ను బుక్ చేసుకునేందుకు కొనుగోలుదారులు ఎగబడుతున్నారు. గడచిన మార్చ్ నెలలో 2522 అమేజ్ సెడాన్‌లు బుక్ అయ్యాయి. ఇవి ఇప్పటికే డీలర్ల స్టాక్ యార్డులకు కూడా చేరిపోయాయి.

హోండా కార్స్ ఇండియా అధికారికంగా తమ అమేజ్ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసిన తక్షణమే వీటిని కొనుగోలుదరాలుకు డెలివరీ చేయాలని డీలర్లు వేచి చూస్తున్నారు. హోండా తమ అమేజ్ సెడాన్‌ను మార్చ్ 11న భారత మార్కెట్లో విడుదల చేయనున్న విషయం తెలిసినదే. మార్చ్ 2013లో హోండా కార్స్ అమ్మకాలు 9 శాతం క్షీణించినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం 35 శాతం వృద్ధిని సాధించాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 54,427 యూనిట్ల నుంచి 73,483 యూనిట్లకు పెరిగాయి.

కాగా.. మార్చ్ 2013 నెలలో అమ్మకాలు కంపెనీ మొత్తం అమ్మకాలు 11,016 యూనిట్ల నుంచి 10,044 యూనిట్లకు పడిపోయాయి. ఈ మొత్తం అమ్మకాల్లో 3917 బ్రయో హ్యాచ్‌బ్యాక్, 2522 అమేజ్ సెడాన్, 3422 సిటీ సెడాన్, 113 అకార్డ్ సెడాన్, 30 సిఆర్-వి ఎస్‌యూవీ కార్లున్నాయని కంపెనీ పేర్కొంది. హోండా అమేజ్ రాకతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హోండా కార్ల అమ్మకాలు లక్ష యూనిట్లను మించిపోవచ్చని అంచనా.

Honda Amaze
Most Read Articles

English summary
The much awaited Honda Amaze sedan is getting huge response from Indian market. So far Honda Cars India received more than 2000 bookings before launching it officially.
Story first published: Thursday, April 4, 2013, 14:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X