ఒక వారానికి దిగొచ్చిన హోండా అమేజ్ వెయిటింగ్ పీరియడ్

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, ఇటీవల భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ బ్లాక్‌బస్టర్ మోడల్ 'హోండా అమేజ్' వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గింది. గడచిన ఏప్రిల్ నెలలో ఇది దేశీయ విపణిలో విడుదలైనప్పుడు దీని వెయిటింగ్ పీరియడ్ నాలు నెలల వరకు ఉండేది. ఇప్పుడు ఒక్క వారానికి దిగొచ్చింది. డిమాండ్‌కు తగిన ఉత్పత్తి హోండా వద్ద ఉంది.

అమేజ్ కాంపాక్ట్ సెడాన్ హోండా చరిత్రలో ఓ సక్సెస్‌‌ఫుల్ కారుగా నిలిచిపోనుంది. ఈ కారు భారత మార్కెట్లో విడుదలై ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తికాక ముందే, కంపెనీ 50,000 యూనిట్లకు పైగా అమేజ్‌లను విక్రయిచింది. ఒక్క నవంబర్ నెలలో హోండా 7,598 అమేజ్ కాంపాక్ట్ సెడాన్లను విక్రయించింది.

Honda Amaze

గడచిన నవంబర్ నెల నుంచి హోండా తమ గ్రేటర్ నోయిడా ప్లాంటులో 3వ షిఫ్టు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా అమేజ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. ఫలితంగా డిమాండ్‌కు అనుగణంగా సరఫరా చేయటంలో హోండా సక్సెస్‌ను సాధించగలిగింది. ఈ ప్లాంటులో 3వ షిఫ్టును ప్రారంభించడంతో అమేజ్ వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గింది. అమేజ్ కొనుగోలుదారులు ఇప్పుడు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

హోండా అమేజ్ ఇటీవలే జెడి పవర్ 2013 ఇండియా ఇన్షియల్ క్వాలిటీ స్టడీలో 'అప్పర్ కాంపాక్ట్ సెడాన్' విభాగంలో ఉత్తమ కారుగా నిలిచింది. అత్యున్నత నాణ్యత ప్రమాణాల విషయంలో ఇది అత్యధిక మార్కులను స్కోర్ చేసింది. హోండా అమేజ్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో (1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్, 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్) లభిస్తుంది. భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.5.05 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Most Read Articles

English summary
Honda Amaze, the Japanese Brand's blockbuster model started off with a waiting period of up to four months when it was launched in April this year. The compact sedan has proved so successful for Honda that even after more than half a year it continues to sell in thousands.
Story first published: Wednesday, December 4, 2013, 9:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X