సెకండ్ జనరేషన్ హోండా సిటీ కార్లు రీకాల్

By Ravi

Honda Recall
జపనీస్ ఆటో దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలో విక్రయించిన సెకండ్ జనరేషన్ సిటీ సెడాన్ కార్లను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. 2007-2008 మధ్య కాలంలో తయారైన 42,672 యూనిట్ల హోండా సిటీ సెడాన్ కార్లు ఈ రీకాల్ క్రిందకు వర్తిస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పవర్ విండో స్విచ్ పార్ట్ రీప్లేస్‌మెంట్ కోసం ఈ రీకాల్ ప్రకటించారు.

డ్రైవర్ సైడ్ విండోలోకి నీరు లేదా ఏదైనా ఇతర ద్రవపదార్ధం వెళ్లినప్పుడు ఈ స్విచ్‌లో సమస్యలు తలెత్తి, పవర్ విండోస్ పనిచేయకపోవటం వంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ రీకాల్‌‌ను ప్రకటించింది. అయితే, ఈ సమస్యకు సంబంధించి దేశంలోని ఏవైపు నుంచి హోండాకు ఫిర్యాదులు రానప్పటికీ, ముందస్తు నివారణ చర్యగా కంపెనీ ఈ రీకాల్‌ను చేపట్టింది.

హోండా రీకాల్ చేసిన సిటీ కార్లలో ఈ పవర్ విండోస్ స్విచ్‌ను దేశవ్యాప్తంగా ఉన్న హెచ్‌సిఐఎల్ డీలర్‌‌షిప్ కేంద్రాలలో ఉచితంగా రీప్లేస్ చేయనుంది. ఇందుకు సంబంధించి సదరు సిటీ కార్ల యజమానులకు ప్రత్యేకంగా దశల వారీగా తెలియజేయటం జరుగుతుంది. తమ ఉత్పత్తుల నాణ్యతా ప్రణాలను మరింత పటిష్టం చేసే దిశలో భాగంగానే ఈ రీకాల్ నిర్వహిస్తున్నామని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది.

కాగా.. ప్రస్తుతం హోండా దేశీయ విపణిలో విక్రయిస్తున్న థర్డ్ జనరేషన్ హోండా సిటీ కార్లలో ఈ సమస్య లేదని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Honda Cars India Ltd (HCIL) said it will recall 42,672 units of second generation Honda City cars manufactured in 2007 and 2008 to replace their power window switch. The company will proactively replace Power Window Switch which may malfunction in case water or any other liquid enters the driver side window.
Story first published: Monday, July 1, 2013, 11:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X