ఫిబ్రవరి నుంచి మరింత ప్రియం కానున్న హ్యుందాయ్ కార్లు

By Ravi

Hyundai
మీకు హ్యుందాయ్ కార్లను కొనాలనుకునే ప్లాన్స్ ఉంటే, వెంటనే కారును కొనేయండి. వచ్చే నెలలో కొందాంలే అని వాయిదా వేసుకుంటే, మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫిబ్రవరి నుంచి తమ వాహనాల ధరలను రూ.20,000 మేర పెంచనుంది.

పెరుగుతున్న ఇన్‌పుట్ ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 2013 నుంచి తమ ఉత్పత్తులను ధరలను పెంచుతామని హ్యుందాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే దేశపు అగ్రగామి మారుతి సుజుకి ఇండియా తమ ఉత్పత్తుల ధరలను గడచిన ఈ నెల 16 నుంచి రూ.20,000 మేర పెంచగా, తాజా ఫోక్స్‌వ్యాగన్ కూడా తమ పోలో, వెంటో కార్ల ధరలను సుమారు రూ.20,000 మేర పెంచిన సంగతి తెలిసిందే.

ఇదే కోవలో హ్యుందాయ్ కూడా తమ ఉత్పత్తులను పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం హ్యుందాయ్ దేశీయ విపణిలో ఇయాన్, శాంత్రో జింగ్, ఐ10, ఐ20, యాక్సెంట్, వెర్నా, ఎలాంట్రా, సొనాటా, శాంటాఫే మోడళ్లను అందిస్తోంది. భారత మార్రెట్లో వీటి ధరలు రూ.2.77 లక్షల (ఇయాన్) నుంచి రూ.25.43 లక్షల (శాంటాఫే) రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Most Read Articles

English summary
India's second largest passenger car maker Hyundai has announced a price hike of up to Rs 20,000 across its model range from February 2013 in the face of rising input costs and inflation.
Story first published: Tuesday, January 29, 2013, 14:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X