గ్రాండ్ సక్సెస్ అయిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

By Ravi

దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) గ్రాండ్‌గా ప్రవేశపెట్టిన గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో గ్రాండ్ సక్సెస్‌ను సాధించింది. ప్రస్తుతం ఈ మోడల్ భారత విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఇది భారీ బుకింగ్‌లను సొంతం చేసుకుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారును విడుదల చేసిన 20 రోజుల్లోనే 1,10,000 ఎంక్వైరీలు, 70,000 టెస్ట్ డ్రైవ్ రిక్వెస్ట్స్, 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 విడుదల తర్వాత ఈ కారుకు లభిస్తున్న స్పందనను చూస్తుంటే, ఇది కాంపాక్ట్ హై ఎంట్రీ సెగ్మెంట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయలదనే ధీమాతో ఉన్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు.


ఇకపోతే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 విషయానికి వస్తే, ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 82 పిఎస్‌ల శక్తిని, 116 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోలుకు 18.9 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
Hyundai Grand i10

అలాగే డీజిల్ వెర్షన్ హ్యందాయ్ గ్రాండ్ ఐ10 కారులో 1.1 లీటర్ సెకండ్ జనరేషన్ యూ2 సిఆర్‌డిఐ(యూరో 5) డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 71 పిఎస్‌ల శక్తిని, 163 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 24 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10లో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
Hyundai has received grand response for the newly launched compact high entry segment car, Hyundai Grand i10. With over 110,000 enquiries and over 10,000 bookings within 20 days, Grand i10 has been well accepted by customers as a value proposition despite the adverse market conditions.
Story first published: Wednesday, September 25, 2013, 15:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X