డిసెంబర్ 5న గ్రాండ్ ఐ10 డీజిల్ ఆటోమేటిక్ లాంచ్!?

By Ravi

కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవలే దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన 'గ్రాండ్ ఐ10' హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ వెర్షన్‌లో తాజాగా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) కలిగిన కొత్త వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10లో కూడా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు గతంలో మేము ఓ కథనంలో ప్రచురించడం జరిగింది.

తాజా.. అప్‌డేట్ ప్రకారం, డిసెంబర్ 5, 2013 హ్యుందాయ్ డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10లో కూడా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను విడుదల చేయనున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10లో కూడా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సును పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో హ్యుందాయ్‌కు తొలి ఎంట్రీ లెవల్ డీజిల్ కారైన గ్రాండ్ ఐ10లో 1.1 లీటర్, 3-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 69 హార్స్ పవర్‌ల శక్తిని, 153 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Hyundai Grand i10 Diesel Automatic

ప్రస్తుతం హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. ఇందులో పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్) ఆప్షన్‌తో లభిస్తుంది. అయితే, డీజిల్ వెర్షన్ మాత్రం కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తోనే లభ్యమవుతోంది. కాగా.. డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 ఆటోమేటిక్ విషయానికి వస్తే, ఇది స్పోర్ట్స్, ఆస్టా, ఆస్టా ఆప్షనల్ అనే మూడు వేరియంట్లోల విడుదల కావచ్చని అంచనా.

ప్రస్తుతం హ్యుందాయన్ నుంచి లభిస్తున్న చవకైన డీజిల్ ఆటోమేటిక్ కారు అంటే వెర్నా సెడాన్ మాత్రమే. దేశీయ మార్కెట్లో దీని ధర రూ.10.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇక హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 డీజిల్ ఆటోమేటిక్ కారు ధర విషయానికి వస్తే, ఇది రూ.7.5 లక్షల నుంచి రూ.9.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Hyundai India recently launched the automatic variants of the petrol powered Grand i10. It has now surfaced that the company might launch the diesel powered variants with an Automatic gearbox on December 5.
Story first published: Friday, November 15, 2013, 14:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X