అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 కార్లలో హ్యుందాయ్ గ్రాండ్

By Ravi

దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ ఎంట్రీ లెవల్ డీజిల్ కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, అప్పుడే టాప్ 5 కార్ల జాబితాలో చేరిపోయింది. సరసమైన ధరకే మెరుగైన మైలేజీనిచ్చే డీజిల్ వేరియంట్ హ్యుందాయ్ తమ గ్రాండ్ బ్రాండ్‌లో ఆఫర్ చేస్తుండటంతో, కొనుగోలుదారులు ఈ మోడల్‌ను సొంతం చేసుకునేందుకు క్యూ కడుతున్నారు.

సెప్టెంబర్ 2013లో హ్యుందాయ్ తమ గ్రాండ్ ఐ10 కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో విడుదల చేసిన కేవలం 90 రోజుల్లోనే 33,000 యూనిట్లకు పైగా గ్రాండ్ ఐ10 కార్లను విక్రయించామని, అంతేకాకుండా ఇది గడచిన నవంబర్ నెలలో అమ్మకాల పరంగా చూసుకుంటే, భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 5 కార్ల జాబితాలో కూడా చోటు దక్కించుకుందని (5వ స్థానంలో) కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

గ్రాండ్ ఐ10 కారుకు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, మెట్రో, టైర్ 2 నగరాల్లో అత్యధికంగా యువ కొనుగోలుదారుల నుంచి ఎక్కువ ఎంక్వైరీలు వచ్చాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.


డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కారులో 1.1 లీటర్ 2వ తరం యూ2 సిఆర్‌డిఐ(యూరో 5) డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 71 పిఎస్‌ల శక్తిని, 163 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిలుకు 24 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కారులో 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 82 పిఎస్‌ల శక్తిని, 116 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోలుకు 18.9 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుంది.

డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10లో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
Hyundai Motor India has received an overwhelming response of its newly launched model ‘Grand’ as it enters the charts of top 5 selling car brands in India. Over 33,000 units have already been delivered to happy customers across India in just 90 days of its national launch in September 2013. 
Story first published: Friday, December 6, 2013, 12:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X