ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 సెడాన్ విడుదల

By Ravi

భారతదేశపు అతిపెద్ద ఆటో షో 'ఇండియన్ ఆటో ఎక్స్‌పో'లో సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు దేశ విదేశాలకు చెందిన కార్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈసారి 2014 ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ రెండు కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. అందులో ఒకటి అప్‌డేటెట్ హ్యుందాయ్ శాంటాఫే ఎస్‌యూవీ మరొకటి, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా తయారు చేస్తున్న ఓ కాంపాక్ట్ సెడాన్.

హ్యుందాయ్ అభివృద్ధి చేస్తున్న కాంపాక్ట్ సెడాన్ ఈ సెగ్మెంట్లోని మారుతి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. ఈ కారుకు హ్యుందాయ్ ఇటీవలే ఉత్పత్తిని నిలిపివేసిన పెట్రోల్ సెడాన్ 'యాక్సెంట్' పేరునే పెట్టాలనే యోచిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ దీని పేరును అధికారికంగా వెళ్లడించే వరకు, మన దీనిని గ్రాండ్ ఐ10 కాంపాక్ట్ సెడాన్ అని పిలుద్దాం.


ఉత్పత్తి వ్యయాన్ని తక్కువగా ఉంచేందుకు, ఈ కాంపాక్ట్ సెడాన్‌ను పూర్తిగా గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఇది హ్యుందాయ్‌కు తొలి కాంపాక్ట్ సెడాన్ కానుంది. చిన్న కార్లపై భారత ప్రభుత్వం అందిస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు గ్రాండ్ ఐ10 సెడాన్‌ను పొడవులో 4 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా డిజైన్ చేయనున్నారు.

అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికే 3765 మి.మీ. పొడవును కలిగి ఉంది. కాబట్టి, గ్రాండ్ ఐ10 కాంపాక్ట్ సెడాన్ విషయంలో ఇది పూర్తి పొడవును ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఉత్పత్తిని ఖర్చును దృష్టిలో ఉంచుకొని అలాగే సరమైన ధరకే దీనిని ఆఫర్ చేసేందుకు, ఇందులో ఇంజన్ల పరంగా కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.

Grand i10 Sedan

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న 1.2 లీటర్ పెట్రోల్, 1.1 లీటర్ డీజిల్ ఇంజన్లనే ఈ కాంపాక్ట్ సెడాన్‌లోను ఉపయోగించే అవకాశం ఉంది. అంతేకాకుండా, హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న అనేక రకాల విడిభాగాలను (ఇంటీరియర్ పార్ట్స్‌తో కలిపి) ఈ కాంపాక్ట్ సెడాన్‌లో కూడా ఉపయోగించనున్నారు. ఇలా చేయటం అత్యంత సరమైన ధరకే ఈ కారును ఆఫర్ చేసే ఆస్కారం ఉంటుంది.
Most Read Articles

English summary
Hyundai India will launch two new models at the 2014 Indian Auto Expo. The first model will be the updated Santa Fe SUV. Something that we told you about earlier this month. It is the second launch, however, that will make more noise. Debuting at the auto show on Feb 6 will be the much awaited compact sedan model based on the Grand i10 hatchback.
Story first published: Wednesday, December 18, 2013, 18:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X