'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2014' అవార్డు గెలుచుకుంది

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన 'హ్యుందాయ్ గ్రాండ్ ఐ10' హ్యాచ్‌బ్యాక్ అప్పుడే అవార్డులను సొంతం చేసుకోవటం మొదలుపెట్టింది. తాజాగా ఈ కారు 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2014' అవార్డును సొంతం చేసుకుంది.

భారతీయ కస్టమర్లకు క్వాలిటీ, ఫీచర్లు, టెక్నాలజీ, అధిక విలువలతో కూడిన ఉత్పత్తిని ఆఫర్ చేయటంలో హ్యుందాయ్ గ్రాండ్ ఓ కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. అత్యంత పోటీతత్వ వాతావరణంతో కూడుకుని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆటోమొబైల్ మార్కెట్లో దేశపు అత్యున్న ఆటోమోటివ్ అవార్డును హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 దక్కించుకోవటం సంతోషంగా ఉందని కంపెనీ పేర్కొంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Indian Car Of The Year 2014

సరమైన ధరకే మెరుగైన మైలేజీనిచ్చే డీజిల్ కారును హ్యుందాయ్ ఆఫర్ చేస్తుండటంతో, భారత్‌లో గ్రాండ్ ఐ10 మోడల్‌కు ఆదరణ బాగా పెరిగింది. అతికొద్ది కాలంలోనే, ఇది భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోయే టాప్-5 కార్ల జాబితాలోకి చేరిపోయింది. మోడ్రన్ డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీ, సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో విడుదలైన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ కప్పా ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 82 పిఎస్‌ల శక్తిని, 116 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోలుకు 18.9 కిలోమీటర్ల మైలేజ్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్)ను ఆఫర్ చేస్తుంది.


డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కారులో 1.1 లీటర్ 2వ తరం యూ2 సిఆర్‌డిఐ(యూరో 5) డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 71 పిఎస్‌ల శక్తిని, 163 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 24 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. డీజిల్ వెర్షన్ గ్రాండ్ ఐ10 కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ గ్రాండ్ ఐ10లో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
Most Read Articles

English summary
Hyundai Motor India has won the most coveted Indian Car of the Year 2014 (ICOTY) award for the newly launched Grand. Grand has created a new benchmark in terms of quality, features and technology offering higher value proposition to Indian customers.
Story first published: Thursday, December 19, 2013, 14:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X