హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై చవక సెడాన్

Hyundai i10
హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఐ10 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ చవక సెడాన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. గతంలో చెప్పుకున్నట్లుగా, ఎంట్రీ లెవల్ సెడాన్ సెగ్మెంట్లో పోటీని ఎదుర్కొని మార్కెట్ వాటాను పెంచుకునేందుకు హ్యుందాయ్ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 ఆధారంగా ఓ సెడాన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలుసుకున్నాం. అయితే, ఉత్పాధక వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని, తక్కువ ధరకే ఈ సెడాన్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో ఐ20 ప్లాట్‌ఫామ్‌పై ఐ10 ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ ఈ చవక సెడాన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ డిజైన్, త్వరలో మార్కెట్లోకి రానున్న హోండా అమేజ్, మహీంద్రా కాంపాక్ట్ వెరిటో, టాటా కాంపాక్ట్ ఇండిగో వంటి మోడళ్లకు పోటీగా సరసమైన ధరకే ఓ సెడాన్‌ను అందించాలని హ్యుందాయ్ యోచిస్తోంది. కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం, 2014 నాటికి ఈ హ్యుందాయ్ ఐ10 సెడాన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ చవక సెడాన్‌ను తొలుతగా టర్కీలో ఉత్పత్తి చేయనున్నామని హ్యుందాయ్ టర్కీ చైర్మన్ ఉమిత్ కరార్‌స్లాన్ వెల్లడించారు. ఈ ప్లాంటు సామర్థ్యాన్ని 2,00,000 యూనిట్లకు పెంచి, ఐ10, ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లతో పాటుగా ఐ10 సెడాన్‌ను ఉత్పత్తి చేస్తామని ఆయన తెలిపారు.

Most Read Articles

English summary
Hyundai is set to join the compact sedan race and no it is not going to launch an i20 based sedan but an i10 based sedan. Hyundai Motors, which competes with Maruti Suzuki in almost all segments, so far does not have a viable competitor to the Swift DZire. There were unconfirmed reports about the carmaker stretching a compact sedan out of the i20 but it has now been officially confirmed that the i10 Compact sedan will be ready by 2014.
Story first published: Friday, January 4, 2013, 15:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X