స్పెషల్ ఎడిషన్ ఐ10ను విడుదల చేసిన హ్యుందాయ్

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ భారత మార్కెట్లో అందిస్తున్న చిన్న కారు 'ఐ10'లో ఓ స్పెషల్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలకు పైగా హ్యుందాయ్ ఐ10 కార్లు అమ్ముడుపోయిన నేపథ్యాన్ని పురస్కరించుకొని మరిన్ని అదనపు హంగులతో కూడిన సరికొత్త స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ విడుదల చేసింది. 'ఐటెక్ ఐ10' (iTech i10) అనే పేరుతో ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను హ్యుందాయ్ ఇండియా అందిస్తోంది.

ఈ సరికొత్త హ్యుందాయ్ ఐటెక్ ఐ10 ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
* స్పోర్టీ ఇంటీరియర్స్: స్పెషల్ ఎడిషన్ ఐ10లో డ్యాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్స్, ఏసి వెంట్స్‌పై రెడ్ కలర్ ఫినిషింగ్‌ను గమనించవచ్చు. ఇది కారు ఇంటీరియర్‌కు మంచి స్పోర్టీ లుక్‌నిస్తుంది.
* రెడ్ అండ్ బీజ్ కలర్ సీటింగ్: కారు ఇంటీరియర్స్‌కు మ్యాచ్ అయ్యేలా రెడ్ అండ్ బీజ్ కలర్ కలయితో రూపొందించిన సీట్లను ఈ స్పెషల్ ఎడిషన్‌లో ఉపయోగించారు.
* రియర్ వ్యూ పార్కింగ్ కెమెరా: హ్యుందాయ్ ఐ20, వెర్నా కార్లలో ఉపయోగించినట్లుగా ఈ స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐటెక్ ఐ10 కారులో కూడా పార్కింగ్ కెమెరాతో జతచేయబడిన రియర్ వ్యూ మిర్రర్‌ను అమర్చారు.
* ఐటెక్ బాడీ గ్రాఫిక్స్: స్పెషల్ ఎడిషన్ అని తెలిసేలా కారు బాడీపై అక్కడక్కడా ఐటెక్ అని రాసి ఉండే బాడీ గ్రాఫిక్స్‌ను ఈ వేరియంట్‌లో చూడొచ్చు.
* స్టీరింగ్ వీల్‌పై బ్లూటూత్ కంట్రోల్స్: కారులోపలి బ్లూటూత్ సిస్టమ్‌ను కంట్రోల్ చేసేందుకు స్టీరింగ్ వీల్‌కు కాస్తం క్రింది భాగంలో బ్లూటూత్ కంట్రోల్స్‌ను అమర్చారు.
* ఈ స్పెషల్ ఎడిషన్ ఐ10 కేవలం 1.1 లీటర్ ఎరా, 1.2 లీటర్ మాగ్నా వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతుంది.
* ఇది వైట్, రెడ్ బాడీ కలర్స్‌తో మాత్రమే లభ్యమవుతుంది.
స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ ఐటెక్ ఐ10 ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • హ్యుందాయ్ ఐ10 ఎరా 1.1, క్రిస్టల్ వైట్ (సాలిడ్) - రూ.4.24 లక్షలు
  • హ్యుందాయ్ ఐ10 ఎరా 1.1, గార్నెట్ రెడ్ (మెటాలిక్) - రూ.4.27 లక్షలు
  • హ్యుందాయ్ ఐ10 మాగ్నా 1.2, క్రిస్టల్ వైట్ (సాలిడ్) - రూ.4.57 లక్షలు
  • హ్యుందాయ్ ఐ10 మాగ్నా 1.2, గార్నెట్ రెడ్ (మెటాలిక్) - రూ.4.60 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Hyundai iTech i10 Special Edition Launched
Most Read Articles

English summary
Launched in 2007, Hyundai's i10 model has gained notable success worldwide over the years. According to a new Hyundai ad, the company has sold over 12 lakh i10 models worldwide and on this occassion the company has launched a new special edition model of the i10, named ‘iTech i10' for the Indian market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X