వెర్నా సెడాన్‌ను అప్‌డేట్ చేయనున్న హ్యుందాయ్

By Ravi

కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ 'హ్యుందాయ్ వెర్నా'లో కొద్దిపాటి మార్పులు చేయనుంది. ప్రస్తుత వెర్నాకు మరింత ప్రీమియం లుక్, కంఫర్ట్ ఫీల్‌ను ఇచ్చేలా ఈ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి.

ఇందులో ప్రధానంగా, బ్యాక్-లిట్ పవర్ విండో స్విచ్‌లు, బ్యాక్-లిట్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ (టాప్ ఎండ్ వేరియంట్లలో), రీస్టయిల్ చేయబడిన అల్లాయ్ వీల్స్, స్టీల్ రిమ్ స్పేర్ వీల్ (ఇదివరకు అల్లాయ్ వీల్ ఉండేది), వెనుక సీట్లలో రెండు హెడ్ రెస్ట్స్ (ప్రస్తుతం 3 ఉన్నాయి) వంటి మార్పులు ఉండనున్నాయి.

ఇవేకాకుండా, హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారులో కంపెనీ ఆఫర్ చేస్తున్న డేటైమ్ ఎల్ఈడి రన్నింగ్ లైట్లను ఈ కొత్త అప్‌డేటెడ్ హ్యుందాయ్ వెర్నాలో కూడా ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే (బహుశా ఈ పండుగ సీజన్‌లో విడుదల కావచ్చని అంచనా) ఈ కొత్త షోరూమ్‌లోల దర్శనమివ్వనుంది.

Hyundai Verna

కాగా.. కొత్త హ్యుందాయ్ వెర్నా ఇంజన్ల పరంగా మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ఇది మొత్తం నాలుగు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి, 1.4 లీటర్ పెట్రోల్ విటివిటి ఇంజన్, 1.6 లీటర్ పెట్రోల్ విటివిటి ఇంజన్, 1.4 లీటర్ డీజిల్ కామన్ రైల్ సిఆర్‌డిఐ ఇంజన్, 1.6 లీటర్ డీజిల్ విజిటి సిఆర్‌డిఐ ఇంజన్.

ఇందులో 1.6 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభించే వెర్నా కారు 4-ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి. ఇతర వేరియంట్లు 5-స్పీడ్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

English summary
According to sources, Hyundai Motors India is expected to update its mid size sedan Verna with minor changes.
Story first published: Friday, August 23, 2013, 10:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X