భారత రోడ్లు ఇప్పటికీ సురక్షితం కాదు: డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్

Accident
భారతీయ రోడ్లు చాలా ప్రమాదరకమైనవి, అసురక్షతతో కూడినవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన నివేదికలో పేర్కొంది. గ్లోబల్ రోడ్ సేఫ్టీపై డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రోడ్లను కలిగి దేశాల్లో ఇండియా కూడా ఒకటని తేలింది. మొత్తం 182 దేశాల నుంచి ప్రపంచ జనాభాలో దాదాపు 99 శాతం నుంచి సేకరించిన నివేదికలో డబ్ల్యూహెచ్ఓ ఈ విషయాన్ని పేర్కొంది.

రోడ్డు సేఫ్టీకి సంబంధించి, ప్రమాధానికి కారణమయ్యే.. మద్యం సేవించి వాహనం నడపటం, మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయటం, హెల్మెట్లు, సీట్ బెల్ట్‌లు, ఛైల్డ్ రెస్ట్రైంట్స్ వంటి ధరించకపోవటం అనే ఐదు కీలక నిబంధనలకు కట్టుబడి ఉండేది కేవలం 28 దేశాలు మాత్రమే పాటిస్తున్నాయని, మిగిలిన ఈ దేశాల్లో ఈ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ తన నివేదిక తెలిపింది.

పై నిబంధనలను పాటించే దేశాల జనాభ, మొత్తం ప్రపంచ జనాభాలో కేవలం 7 శాతం మాత్రమే. అంటే ఇంకా 93 శాతం మంది ఈ నిబంధనలకు కట్టుబడి డ్రైవింగ్ చేయటం లేదని తేటతెల్లమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా 12.4 లక్షల మంది చనిపోతుండగా, అందులో మన దేశంలోనే ఏటా లక్ష మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు.

రానున్న ఐదేళ్లలో రోడ్ సేఫ్టీ విషయంలో అవగాన కల్పించేందుకు డబ్ల్యూహెచ్ఓ రోడ్ సేఫ్టీ విభాగం చేపట్టనున్న ప్రాజెక్టులో టాప్ 10 దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఇందుకోసం ఆరుగురు అంతర్జాతీయ భాగస్వాములతో కూడిన ప్యానెల్‌ను డబ్ల్యూహెచ్ఓ నియమించనుంది.

ఇప్పటికే ఈ ప్రాజెక్టును, హెల్మెట్‌లు ధరించకుండా మోటార్‌సైకిళ్లు ద్విచక్ర వాహనాలు నడపటం, వేగానికి మించి వాహనాలు నడపటం ఎక్కువగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో అమల్లోకి తీసుకువచ్చారు. దశల వారీగా మరిన్ని రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టును అమలుపరచి భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా పెట్టుకుంది.

Most Read Articles

English summary
The World Health Organization has released it global report on road safety which reveals the pathetic state of Indian road safety. According to the WHO report India tops the list of most deaths caused due to road accidents, while also rating very poorly in when it comes to safety rule compliance and law enforcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X