న్యూయార్క్ ఆటో షోలో దర్శనమివ్వనున్న జాగ్వార్ ఎక్స్‌జేఆర్

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ తమ సరికొత్త పెర్ఫామెన్స్ లగ్జరీ సూపర్-సెలూన్ 'ఎక్స్‌జేఆర్'ను ఈ నెలాఖరు నుండి ప్రారంభం కానున్న 2013 న్యూయార్క్ ఆటో షోలో ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో, తమ సరికొత్త కారు ఫోటోను కంపెనీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ హై పెర్ఫామెన్స్ జాగ్వార్ ఎక్స్‌జేఆర్ కారులో శక్తివంతమైన 5.0 లీటర్, సూపర్‌ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 550 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జోడించే అవకాశం ఉంది. రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించే జాగ్వార్ ఎక్స్‌జేఆర్ కేవలం 5 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు. జాగ్వార్ ఎక్స్‌జేఆర్ ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి, బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 760ఎల్ఐ, ఆడి ఏ8 ఎల్ డబ్ల్యూ12 క్వాట్రో వంటి కార్లతో పోటీ పడనుంది.

చూపరుల దృష్టిని ఆకట్టుకునే ఎక్స్టీరియర్స్, అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్స్ ఈ కొత్త జాగ్వార్ సొంతం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 7 వరకూ జరగనున్న 2013 న్యూయార్క్ ఆటో షోలో ఈ కొత్త కారును ప్రదర్శించనున్నారు. సరికొత్త జాగ్వార్ ఎక్స్‌జేఆర్ సూపర్-సెలూన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Jaguar XJR
Most Read Articles

English summary
British luxury carmaker Jaguar is all set to debut its new flagship super-seloon, the XJR at the upcoming 2013 New York Auto Show. It is powered by 5.0 litre supercharged petrol engine which delivers 550PS of peak power and it can reach 0-100 km/h in less than 5 seconds. Stay tuned to Drivespark for more updates.
Story first published: Friday, March 22, 2013, 12:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X