ఈ ఏడాది చివరి నాటికి రానున్న ఫియట్ జీపులు

ఎస్‌యూవీ ప్రియులకు గుడ్ న్యూస్. త్వరోలనే భారత మార్కెట్లోకి మరొక కొత్త బ్రాండ్ ప్రవేశించనుంది. ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్‌కు 'జీప్' (JEEP) బ్రాండ్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో తమ ఉత్పత్తులను విడుదల చేయనుంది. డీలర్‌షిప్ నెట్‌వర్క్ షేరింగ్ విషయంలో టాటా మోటార్స్‍‌తో కుదుర్చుకున్న భాగస్వామ్యం నుంచి ఫియట్ విడిపోయిన తర్వాత, భారత్‌లో తమ ఉత్పత్తుల కోసం సోలోగా అధీకృత డీలర్‌షిప్‌లను ఫియట్ ఇండియా ప్రారంభిస్తున్న సంగతి తెలిసినదే.

ఈ నేపథ్యంలో, ఇటీవలే చెన్నైలో తమ రెండవ డీలర్‌షిప్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రెసిడెంట్ ఎండీ నాగేష్ బసవనహల్లి మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి ఫియట్ జీప్‌లు భారత రోడ్లపై పరుగులు పెట్టనున్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఫియట్ జీప్‌ను మార్కెట్లోకి తేవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ప్రారంభంలో ఉత్తర అమెరికాలో తయారైన జీప్‌లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తామని, అనంతరం వీటిని ఇక్కడే అసెంబుల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వంద డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని, రానున్న మూడేళ్లలో నాలుగు ఫియట్ బ్రాండ్ వాహనాలను, జీప్ బ్రాండ్ కింద నాలుగు వాహనాలను అలాగే అబార్త్ బ్రాండ్‌ను కూడా భారత్‌లో విడుదల చేస్తామని నాగేష్ చెప్పారు

Fiat Jeep
Most Read Articles

English summary
Italy-based Fiat group, which has tied up with US-based car maker Jeep, will launch the first model under the brand in the country during the last quarter of 2013 as a "completely built unit", a top official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X