300 కెఎమ్‌పిఎల్ కారును తయారు చేసిన విద్యార్థులు

By Ravi

Jugaad 2013
జర్మనీకు చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ లీటరుకు 100 కిలోమీటర్ల మైలేజీనిచ్చే కారును తయారు చేస్తే, మన ముంబైకు చెందిన విద్యార్థులు లీటరుకు ఏకంగా 300 కిలోమీటర్ల మైలేజీనిచ్చే కారును తయారు చేసి చూపించి ఔరా అనిపించుకున్నారు. ముంబైలోని కె.జె. సోమయ్య కాలేజ్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఓ అద్భుతమైన కారును ఆవిష్కరించారు.

జుగాడ్ 2013 అని పిలిచే ఈ కారు 300 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుందట. అంతేకాకుండా, ఈ కారు త్వరలో షెల్ గ్లోబల్ ఆధ్వర్యంలో కౌలాలంపూర్‌లోని సెపాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి అంతర్‌కళాశాల పోటీలో కూడా పాల్గొనబోతుంది. జుగాడ్ 2013 ఒక సింగిల్ సీట్ కారు. ఈ కారులో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది.

ఇది 35సీసీ పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. విద్యార్థులు దాదాపు ఐ నెలలు కష్టపడి ఈ ఇంజన్‌ను అభివృద్ధి చేశారు. అత్యధిక మైలేజీనిచ్చే కార్లకు వేదిక అయిన షెల్ ఈకో మారథాన్ కార్యక్రమం కోసం వివిధ దేశాల నుంచి సుమారు 300 బృందాలు అభ్యర్థనలు పంపగా అందులో 150 బృందాలు ఎన్నికైనట్లు సమాచారం. ఇలా ఎంపికైన బృందాల్లో కె.జె. సోమయ్య విద్యార్థుల బృందం కూడా ఒకటి. మరి వీరికి అంతా మంచే జరగాలని మనం కూడా కోరుకుందాం.

Most Read Articles

English summary
Students of KJ Somaiya Engineering College, Mumbai have developed a prototype car that has an estimated mileage of 300 kmpl. Jugaad, as the car is called, will take part in the fourth annual Shell eco Marathon Car Race in Kuala Lumpur in July.
Story first published: Friday, May 31, 2013, 12:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X