డిసెంబర్ 12న భారత్‌లో లాంబోర్గినీ ట్రాక్టర్ల విడుదల

By Ravi

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ తమ 'సూపర్ ట్రాక్టర్ల'ను ఇండియాలో ప్రవేశపెట్టనున్నట్లు గడచిన ఏప్రిల్ నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, లాంబోర్గినీ భారత్‌లో తమ ట్రాక్టర్ల విడుదలకు ముహుర్తం ఖరారు చేసింది. ఈనెల 12వ తేదీన లాంబోర్గినీ ట్రాక్టర్లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి.

దేశంలోని సంపన్న రైతు కుటుంబాలను, ధనవంతులను లక్ష్యంగా చేసుకొని లాంబోర్గినీ ఈ ట్రాక్టర్లను భారత్‌లో విడుదల చేయబోతోంది. దీన్నిబట్టి చూస్తుంటే, లాంబోర్గినీ ట్రాక్టర్లు సామాన్య రైతులకు అందని ద్రాక్షగానే మిగిలే ఆస్కారం ఉంది. ఈ ట్రాక్టర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు డిసెంబర్ 12, 2013న తెలియనున్నాయి.

ఇది కూడా చదవండి: 2013 నైట్రో ట్రాక్టర్‌ను ఆవిష్కరింటిన లాంబోర్గినీ


వాస్తవానికి లాంబోర్గినీ సూపర్‌కార్ల తయారీ కన్నా ముందుగా ట్రాక్టర్లను ఉత్పత్తి చేసేది. అయితే, లాంబోర్గినీ సూపర్‌కార్లు మంచి ప్రాచుర్యాన్ని సంపాధించుకోవటంతో, ట్రాక్టర్ల వ్యాపారం సేమ్ డచ్-ఫార్ (ఎస్‌డిఎఫ్) (SAME Deutz-Fahr) గ్రూపులో భాగమైంది.

ఇది కూడా చదవండి.. లాంబోర్గినీ కార్ల తయారీ ఎలా మొదలైంది?

ఎస్‌డిఎఫ్ ఇండియా, తమిళనాడులోని రాణిపేట్ ఉత్పత్తి కేంద్రంలో లాంబోర్గినీ ట్రాక్టర్ల ఉత్పత్తి చేస్తోంది. అయితే, ఇక్కడ ఉత్పత్తి అయిన ట్రాక్టర్లను భారత మార్కెట్లో విక్రయించడం లేదు. వీటిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గడచిన సంవత్సరంలో ఎస్‌డిఎఫ్ గ్రూప్ భారత్‌లో నిర్మించిన 6,000 ట్రాక్టర్లలో 800 ట్రాక్టర్ల లాంబోర్గినీ లోగోతో రూపొందించారు. ఈ ట్రాక్టర్లను యూరప్, మలేషియా దేశాలకు కంపెనీ ఎగుమతి చేస్తోంది. ఈ ట్రాక్టర్లలో ఎక్కువ భాగం స్థానికంగా భారత్‌లో లభించే విడిభాగాలను ఉపయోగిస్తున్నారు.

Most Read Articles

English summary
Lamborghini tractors will be launched in India on December 12th. Lamborghini tractors are known for their advanced technology and styling. Stay tuned for more updates.
Story first published: Friday, December 6, 2013, 10:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X