అతిత్వరలో విడుదల కానున్న నిస్సాన్ సన్నీ ఆటోమేటిక్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ నిస్సాన్ సన్నీలో ఓ ఆటోమేటిక్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకే ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఈ వార్తను నిజం చేస్తూ, అతి త్వరలోనే ఈ కారును మార్కెట్లో విడుదల చేస్తామని పేర్కొంది. ఇప్పటికే చెన్నైలోని రెనో-నిస్సాన్ ప్లాంటులో ఆటోమేటిక్ వెర్షన్ సన్నీ సెడాన్ ఉత్పత్తి ప్రారంభమైంది.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వేరియంట్ డీలర్ల స్టాక్ యార్డులకు చేరినట్లు తెలుస్తోంది. రెనో స్కాలాలో ఉపయోగించిన ఎక్స్-ట్రానిక్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) గేర్ బాక్సునే నిస్సాన్ సన్నీలోను ఉపయోగించనున్నారు. ఇది కూడా పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యం కావచ్చని అంచనా.

సివిటి గేర్‌బాక్స్‌ సాధారణ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల కన్నా భిన్నంగా ఉంటుంది (యాక్టివా వంటి ఆటోమేటిక్ స్కూటర్లలో ఉపయోగించే ట్రాన్సిమిషన్ మాదిరిగా). ఇందులోని అధిక గేర్ రేషియోల సంఖ్య కారణంగా కారు జర్క్‌లు ఇవ్వకుండా సాఫీగా ముందుకు సాగిపోతుంది. ఇది మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కన్నా ఎక్కువ మైలేజీనిస్తుంది.

రెనో ఇండియా తమ ఆటోమేటిక్ స్కాలా సెడాన్‌ను రూ.8.99 లక్షలకు విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ సన్నీ సెడాన్ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.8.69 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారం మరికొద్ది రోజుల్లోనే వెల్లడి కానుంది. తాజా అప్‍‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Nissan Sunny
Most Read Articles

English summary
Nissan India is expected to launch the much awaited Sunny Automatic sedan very soon. According to the sources, the Nissan Sunny Automatic is already into production at its Chennai plant and the carmaker has started dispatching the cars to various dealers across the country.
Story first published: Tuesday, April 9, 2013, 15:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X