త్వరలో మార్కెట్లోకి రానున్న చవక ఎక్స్‌యూవీ500

By Ravi

Mahindra XUV500
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500'లో ఓ చవక వేరియంట్ త్వరలోనే మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ విపణిలో ప్రస్తుతం ఈ మోడల్ డబ్ల్యూ6 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఆల్ వీల్ డ్రైవ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. కాగా.. తాజా సమాచారం ప్రకారం, ఇందులో డబ్ల్యూ4 అనే చవక వేరియంట్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తుంది.

ప్రస్తుతం లభిస్తున్న డబ్ల్యూ6 వేరియంట్‌లో కొన్ని ఫీచర్లను తగ్గించి, తక్కువ ధరకే ఈ ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఎస్‌యూవీ సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకే కంపెనీ ప్రణాళికకు శ్రీకారం చుట్టిన్లు తెలుస్తోంది.

గతంలో ఒకానొక సందర్భంలో ఈ విషయంపై మహీంద్రా అండ్ మహీంద్రా అధ్యక్షుడు (ఫామ్ ఎక్విప్‌‌మెంట్, ఆటోమోటివ్ సెక్టార్) పవన్ గోయెంకా మాట్లుడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాప్-ఎడ్ వేరియంట్ ఎక్స్‌యూవీ500 కన్నా మరింత ఖరీదైన వేరియంట్‌ను అలాగే ఓ చవక వేరియంట్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తామని, అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అయితే, ఈలోపుగా మహీంద్రా ఎక్స్‌యూవీ500లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేస్తామని కూడా ఆయన చెప్పటం జరిగింది.

ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500లో పవర్‌ఫుల్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ 140 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra and Mahindra might soon launch a new entry level variant of the XUV500 (reportedly called the W4). Stay tuned to Drivespark for latest updates.
Story first published: Wednesday, May 15, 2013, 15:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X