మహీంద్రా వాహనాలకు సెంట్రల్ బ్యాక్ ఆఫ్ ఇండియా లోన్స్

By Ravi

Car Loan
దేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చేతులు కలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా, మహీంద్రా అందిస్తున్న అన్ని వాహనాలను (ద్విచక్ర వాహనాలు మినహా) సెంట్రల్ బ్యాంక్ రుణ సౌకర్యాన్ని కల్పించనుంది.

ఇకపై మహీంద్రా కస్టమర్లు కొనుగోలు చేసే కార్లు, త్రిచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలకు సెంట్ సహయోగ్, సెంట్ వెహికల్, ఎస్ఆర్‌టి అనే స్కీమ్ పేర్లతో సెంట్రల్ బ్యాంక్ నుంచి ఫైనాన్స్ పొందవచ్చు. మహీంద్రాం అండ్ మహీంద్రాకు దేశవ్యాప్తంగా 250 డీలర్‌షిప్ కేంద్రాలుండగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 4300 లకు పైగా బ్రాంచ్‌లున్నాయి.

ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఛీఫ్ సేల్స్ అండ్ కస్టమర్ కేర్ ఆఫీస్ (ఆటోమోటివ్ డివిజన్) అరున్ మల్హోత్రా మాట్లాడుతూ.. మహీంద్రాలో తమ వినియోగదారులకు ఉత్తమ స్కీమ్‌లు అందించేందుకు చూస్తామని, ఇందులో భాగంగానే సెంట్రల్ బ్యాంకుతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని అన్నారు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ వి టంకసాలే సమక్షంలో అరున్ మల్హోత్రా, సెంట్రల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నరేందర్ సింగ్ అవగాహనా ఒప్పందం (ఎమ్ఓయూ)పై సంతకాలు చేశారు.

Most Read Articles

English summary
Auto major Mahindra and Mahindra said it has tied up with public sector lender Central Bank of India for financing facilities for its entire range of vehicles, except two-wheelers.
Story first published: Tuesday, July 16, 2013, 10:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X