ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి చవక ఎక్స్‌యూవీ500!

By Ravi

యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500'లో ఓ చవక వేరియంట్‌ను కంపెనీ విడుదల చేయనున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఇదే విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఓ తక్కువ ధర కలిగిన ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తుంది.

ఈ విషయంలో (చవక ఎక్స్‌యూవీ500 గురించి) వినియోగదారుల నుంచి తమకు వివిధ ఫీడ్‌బ్యాక్‌లు వస్తున్నాయని, వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఓ లోవర్ వేరియంట్ ఎక్స్‌యూవీ500 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రవీణ్ షా తెలిపారు. తగ్గుముఖం పడుతున్న అమ్మకాలను ఈ కొత్త వేరియంట్ ద్వారా అధిగమించవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

మహీంద్రా 2001లో తమ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని దేశీయ విపణిలో విడుదల చేసింది. ప్రస్తుతం ఇది డబ్ల్యూ6 (ఫ్రంట్ వీల్ డ్రైవ్), డబ్ల్యూ8 (ఫ్రంట్ వీల్ డ్రైవ్), డబ్ల్యూ8 (ఆల్ వీల్ డ్రైవ్) అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు రూ.12.13 లక్షల నుంచి రూ.14.77 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ500 భారత మార్కెట్లో విడుదలైన 20 నెలల వ్యవధిలో 63,000 లకు పైగా యూనిట్లు అమ్ముడుపోయాయి.

Mahindra XUV500
Most Read Articles

English summary
Mahindra and Mahindra will introduce a lower variant of its sports utility vehicle XUV 500 by the end of this fiscal in a bid to rev up sales in a sluggish market. "We constantly keep on getting customer feedback and taking that into account, we plan to launch a lower variant of XUV 500 by the end of the current fiscal," Mahindra & Mahindra Chief Executive Automotive Division Pravin Shah said.
Story first published: Monday, June 10, 2013, 15:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X