త్వరలో దక్షిణాఫ్రికాలో విడుదల కానున్న మహీంద్రా క్వాంటో

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న తాజా ఉత్పత్తి క్వాంటో త్వరలోనే గ్లోబల్ మార్కెట్లకు వెళ్లనుంది. మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీని దక్షిణాఫ్రికా మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. గడచిన నవంబర్ నెలలో దేశీయ విపణిలో విడుదలైన మహీంద్రా క్వాంటోకు భారత మార్కెట్ నుంచి ప్రోత్సాహకర స్పందన లభించింది. మహీంద్రా ఇప్పటి వరకూ భారత్‌లో సుమారు 12,000 యూనిట్లకు పైగా క్వాంటో ఎస్‌యూవీలను విక్రయించింది.

భారత మార్కెట్లో సక్సెస్ అయిన వాహనాలు దక్షిణాఫ్రికా మార్కెట్లో అదే తరహాలో విజయం సాధిస్తాయనేది కంపెనీ విశ్వాసం. ఇందుకు మంచి ఉదాహరణ కంపెనీ అందిస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ500. క్వాంటో విషయానికి వస్తే.. ఇటు బ్యాచ్‌బ్యాక్ లాంటి కాంపాక్ట్ డిజైన్‌ను, అటు సెడాన్‌లోని సౌకర్యాన్ని మరియు ఎస్‌యూవీ లాంటి పవర్‌ను కలగలపి రూపొందించటం జరిగింది. రూ.5.99 లక్షల ఆకర్షనీయమైన ధరకే మార్కెట్లోకి ప్రవేశించిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా ఎక్స్‌యూవీ500 మాదిరిగానే సక్సెస్ కాగలదని మహీంద్రా అండ్ మహీంద్రా యోచిస్తోంది.

మహీంద్రా క్వాంటో - ఫ్రంట్ వ్యూ

మహీంద్రా క్వాంటో - ఫ్రంట్ వ్యూ

మహీంద్రా క్వాంటో - రియర్ వ్యూ

మహీంద్రా క్వాంటో - రియర్ వ్యూ

మహీంద్రా క్వాంటో - ఇంటీరియర్ వ్యూ

మహీంద్రా క్వాంటో - ఇంటీరియర్ వ్యూ

మహీంద్రా క్వాంటో - సైడ్ వ్యూ

మహీంద్రా క్వాంటో - సైడ్ వ్యూ

మహీంద్రా క్వాంటో - మ్యూజిక్ సిస్టమ్

మహీంద్రా క్వాంటో - మ్యూజిక్ సిస్టమ్

మహీంద్రా క్వాంటో - పవర్‌ఫుల్ ఏసి

మహీంద్రా క్వాంటో - పవర్‌ఫుల్ ఏసి

మహీంద్రా క్వాంటో - ఆల్ పవర్ విండోస్

మహీంద్రా క్వాంటో - ఆల్ పవర్ విండోస్

మహీంద్రా క్వాంటో - సైడ్ మిర్రర్ కంట్రోల్స్

మహీంద్రా క్వాంటో - సైడ్ మిర్రర్ కంట్రోల్స్

మహీంద్రా క్వాంటో - సెంటర్ వ్యూ మిర్రర్, స్టోరేజ్ స్పెస్

మహీంద్రా క్వాంటో - సెంటర్ వ్యూ మిర్రర్, స్టోరేజ్ స్పెస్

మహీంద్రా క్వాంటో - 17.2 కెఎమ్‌పిఎల్ మైలేజ్

మహీంద్రా క్వాంటో - 17.2 కెఎమ్‌పిఎల్ మైలేజ్

మహీంద్రా క్వాంటో - రియర్ సీట్ (2వ వరస) లెగ్ రూమ్

మహీంద్రా క్వాంటో - రియర్ సీట్ (2వ వరస) లెగ్ రూమ్

మహీంద్రా క్వాంటో - 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో‌ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్

మహీంద్రా క్వాంటో - 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో‌ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్

మహీంద్రా క్వాంటో - వెనుక డోర్‌పై స్పేర్ వీల్

మహీంద్రా క్వాంటో - వెనుక డోర్‌పై స్పేర్ వీల్


మహీంద్రా క్వాంటోలో శక్తివంతమైన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో‌ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం). మహీంద్రా క్వాంటో మొత్తం నాలుగు వేరియంట్లలో (సి2 సి4, సి6, సి8) లభిస్తుంది.

మహీంద్రా క్వాంటోలో డిజిటల్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్, మైక్రో హైబ్రిడ్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇంటెలిజెంట్ రివర్స్ అసిస్ట్, సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ వార్నింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరిడార్ రెడ్, డైమండ్ వైట్, రాకీ బీజ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

Most Read Articles

English summary
India's leading utility vehicle manufacturer Mahindra and Mahindra (M & M) has revealed plans of launching its compact SUV Quanto in the South African market.
Story first published: Saturday, January 5, 2013, 15:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X