వీకెండ్ ర్యాలీలో 25.89 kmpl మైలేజీనిచ్చిన మహీంద్రా క్వాంటో

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ క్వాంటో, ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దానికి ప్రకారం లీటరు డీజిల్‌కు 17.21 కిలోమీటర్ల మైలేజీని మాత్రమే ఇస్తుంది. అయితే, రియల్ లైఫ్ కండిషన్స్‌లో ఇది సగటున లీటరుకు సుమారు 15 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. కానీ, ఇది ఆశ్చర్యకరంగా లీటరుకు 25.89 కిలోమీటర్ల మైలేజీనిచ్చింది.

మహీంద్రా నిర్వహించిన క్వాంటో వీకెండ్ మైలేజ్ ర్యాలీలో ఓ క్వాంటో యజమాని తన నైపుణ్యమైన డ్రైవింగ్‌తో లీటరుకు 25 కిలోమీటర్లకు పైగా మైలేజీని సాధించాడు. రెండవ ఎడిషన్ 'బూస్ట్ యువర్ ఫ్యూయెల్ - క్వాంటో వీకెండే మైలేజీ ర్యాలీస్' కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2013న బెంగుళూరులో నిర్వహించారు. ఇందులో 30 మంది క్వాంటో యజమానులు తమ వాహనాలతో పాల్గొన్నారు.


ఈ ర్యాలీ మొత్తం 60 కిలోమీటర్ల దూరం (మనిపాల్ కంట్రీ రిసోర్ట్ నుంచి నైస్ రోడ్ ద్వారా ప్రయాణించి, తిరిగి రావటం) సాగింది. ఇందులో పార్థిబన్ అనే ఓ మహీంద్రా క్వాంటో యజమాని తన కారుతో లీటరుకు 25.89 కి.మీ. మైలేజీని సాధించి అగ్రస్థానంలో నిలువగా, మహమ్మద్ అన్సార్ లీటరుకు 24.16 కి.మీ. మైలేజీతో ద్వితీయ స్థానంలో నిలిచారు. సుందర్ లీటరుకు 24.06 కి.మీ. మైలేజీని సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురు వరుసగా రూ.10,000, రూ.5,000, రూ.3,000 నగదు బహుమతి గెలుచుకున్నారు.

ఇక మహీంద్రా క్వాంటో విషయానికి వస్తే, ఇందులో అమర్చిన శక్తివంతమైన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో‌ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం క్వాంటో లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో (సి2 సి4, సి6, సి8) లభిస్తుంది.

Quanto SUV

క్వాంటోలో డిజిటల్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్, మైక్రో హైబ్రిడ్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇంటెలిజెంట్ రివర్స్ అసిస్ట్, సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ వార్నింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరిడార్ రెడ్, డైమండ్ వైట్, రాకీ బీజ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.
Most Read Articles

English summary
Mahindra Quanto has an ARAI certified mileage of 17.21 kmpl. In real life conditions the best you might be able to achieve is about 15 kmpl. But you will be surprised to know that with some really careful driving you could extract a mileage of over 25 kmpl. You should believe us because a fuel economy figure of 25.89 kmpl was achieved last weekend by a Quanto owner taking part in the Quanto Weekend Mileage Rally organised by Mahindra.
Story first published: Saturday, October 12, 2013, 10:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X