మహీంద్రా రేవా నుంచి మరింత శక్తివంతమైన ఈ2ఓ

By Ravi

Mahindra e2o
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా రేవా తాజాగా భారత మార్కెట్లోకి తమ తొలి ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారు 'మహీంద్రా ఈ2ఓ'ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా కంపెనీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం విడుదల చేసిన ఈ2ఓ కారు కన్నా మరింత శక్తివంతమైన ఈ2ఓను అభివృద్ధి చేస్తున్నామని, దీనిని ప్రత్యేకించి ఎగుమతి మార్కెట్లో కోసం తయారు చేయనున్నామని తెలిపారు. ఏప్రిల్ 2014 నాటికి ఈ మోడల్ ఎగుమతులు ప్రారంభం కానున్నాయి.

మహీంద్రా ఈ2ఓ - పూర్తి వివరాలు

ప్రస్తుతం మహీంద్రా రేవా విడుదల చేసిన ఈ2ఓ ఎలక్ట్రిక్ కారులో 48 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేసే ఓ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 3950 ఆర్‌పిఎమ్ వద్ద 19 కిలోవాట్ల గరిష్ట శక్తిని, 3400 ఆర్‌పిఎమ్ వద్ద 5.4 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్ వరకూ పరుగులు తీస్తుంది. అయితే, కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఈ పవర్‌ఫుల్ మహీంద్రా ఈ2ఓ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కానీ, భవిష్యత్తులో దేశీయ మార్కెట్ కోసం పవర్ స్టీరింగ్ ఆప్షన్‌తో ఈ2ఓ విడులయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Mahindra Reva is working on a more powerful version of its electric car the e2o, which is specifically for export markets. Exports of the new e2o will commence by April 2014. The existing Mahindra e2o is priced at Rs 5.96 lakh (on-road, Delhi).
Story first published: Tuesday, March 19, 2013, 14:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X