ఎక్సైజ్ రాయితీ కోసం మహీంద్రా అండ్ మహీంద్రా లేటెస్ట్ ప్లాన్స్

By Ravi

నాలుగు మీటర్ల తక్కువ పొడవు, 1.5 లీటర్ కన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన యుటిలిటీ వాహనాలపై భారత ప్రభుత్వం ఎక్సైజ్ సుంకంలో రాయితీలను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ ఏడాది కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 2013-14లో పెద్ద యుటిలిటీ వాహనాలపై (4 మీటర్ల కన్నా పొడవు ఉండేవి) ఎక్సైజ్ సుంఖాన్ని 27 శాతం నుంచి 30 శాతం పెంచడం జరిగింది.

ఈ నేపథ్యంలో, పెరిగిన ఈ మూడు శాతం ఎక్సైజ్ సుంకం నుంచి తప్పించుకునేందుకు కార్ల తయారీ సంస్థలు సబ్-ఫోర్ మీటర్ (4 మీటర్ల కన్నా తక్కువ పొడవున్న కార్లను) తయారు చేయటం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ దిశలో దేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) కూడా ఎస్‌యూవీలపై పెరిగిన ఈ 3 శాతం అధనపు ఎక్సైజ్ సుంకం రాయితీని పొందేందుకు సన్నాహాలు చేస్తుంది.

Mahindra Compact SUV

ఇందులో భాగంగా, తమ యుటిలిటీ వాహనాల పొడవును (4 మీటర్లకు దిగువన) అలాగే ఇంజన్ సామర్థ్యాన్ని (1.5 లీటర్ లేదా 1500సీసీ కు దిగువన) లేదా 170 మి.మీ. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ ఉండేలా ఉత్పత్తులను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఎక్సైజ్ సుంకంలో పెంపు తమ ఉత్పత్తి ప్రణాళికపై ప్రభావం చూపిందని, 27 శాతం ఎక్సైజ్ సుంకం పరిధిలోనికి వచ్చేలా సాధ్యమైన చర్యలు తీసుకుంటామని ఎమ్ అండ్ ఎమ్ అధ్యక్షుడు పవన్ గోయెంకా వెల్లడించారు.

ప్రస్తుత బడ్జెట్‌లో పెరిగిన ఎక్సైజ్ సుంకం కారణంగా, మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న దాదాపు అన్ని యుటిలిటీ వాహనాలు (జైలో, బొలెరో, స్కార్పియో, ఎక్స్‌యూవీ500) ప్రభావితమయ్యాయి. ఫలితంగా గడచిన ఏప్రిల్ నెలలో కంపెనీ అమ్మకాలు కేవలం 2 శాతం మాత్రమే వృద్ధిని సాధించాయి. ఎమ్ అండ్ ఎమ్ ఇప్పటికే తమ ఫ్లాగ్‌షిప్ గ్లోబల్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌ను ఆధారంగా చేసుకొని ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. రానున్న రోజుల్లో కాంపాక్ట్ బొలెరో, కాంపాక్ట్ స్కార్పియో మోడళ్లు మార్కెట్లోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Most Read Articles

English summary
India's leading utility vehicle manufacturer Mahindra and Mahindra (M and M) is planning to modify some of its vehicles to help them avoid a 3 per cent additional excise duty on sports utility vehicles as its sales have come under pressure.
Story first published: Tuesday, May 14, 2013, 16:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X