తగ్గనున్న ఎక్స్‌‌యూవీ500, క్వాంటో, రెక్స్టన్ వెయిటింగ్ పీరియడ్

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ500', కాంపాక్ట్ ఎస్‌యూవీ 'క్వాంటో' మరియు లగ్జరీ ఎస్‌యూవీ 'రెక్స్టన్'ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న బుకింగ్‌లను క్లియర్ చేసేందుకు మరియు వీటి వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు అలాగే మరిన్ని కొత్త నగరాల్లో బుకింగ్‌లను ప్రారంభించేందుకు తక్షణమే ఈ మూడు మోడళ్ల ఉత్పత్తిని పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొంది.

విభిన్న ధరల శ్రేణిలో లభిస్తున్న ఈ మూడు ఉత్పత్తులకు తమ వినియోగదారుల నుంచి అనుహ్య స్పందన లభిస్తోందని, ఈ నేపథ్యంలో వీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించి, వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా ఉండేందుకు సన్నాహాలు చేస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా తెలిపారు. వినియోగదారుల సాన్నిహిత్యమైన తమ కంపెనీలో, కనీస వెయిటింగ్ పీరియడ్‌తో తమ కస్టమర్లకు ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500 వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు గాను ఈ మోడల్ ఉత్పత్తిని నెలకు 4,500 యూనిట్లకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటిచింది.

మహీంద్రా క్వాంటో

మహీంద్రా క్వాంటో

మహీంద్రా క్వాంటో వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు గాను ఈ మోడల్ ఉత్పత్తిని నెలకు 4,500 యూనిట్లకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటిచింది.

రెక్స్టన్

రెక్స్టన్

రెక్స్టన్ ఎస్‌యూవీ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు గాను ఈ మోడల్ ఉత్పత్తిని నెలకు 500 యూనిట్లకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటిచింది.

రెక్స్టన్

రెక్స్టన్

క్వాంటో

క్వాంటో


దేశీయ విపణిలో మంచి సక్సెస్‌ను సాధించిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి ఇప్పటికీ భారీ డిమాండ్ ఉంటోంది. కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా క్వాంటోది కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం క్వాంటోకు 12,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు ఉండగా, కంపెనీ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ రెక్స్టన్ ఎస్‌యూవీకి 1,500 యూనిట్లకు పైగా బుకింగ్‌లు ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ప్రీమియం ఎస్‌యూవీని కేవలం కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే విడుదల చేయటం జరిగింది.

ఈ నేపథ్యంలో, మహీంద్రా క్వాంటో ఉత్పత్తిని నెలకు 3,500 యూనిట్లకు, మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఉత్పత్తిని నెలకు 4,500 యూనిట్లకు, శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఉత్పత్తిని నెలకు 500 యూనిట్లకు పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. గడచిన డిసెంబర్ నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం 22,761 వాహనాలను విక్రయించగా అందులో 3,566 ఎక్స్‌వీ500 ఎస్‌యూవీలు, 2,946 క్వాంటో ఎస్‌యూవీలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
India's largest utility vehicle manufacturer Mahindra and Mahindra has ramped up production of the XUV5OO, Quanto and Rexton to reduce backlogs and waiting periods and open bookings in additional cities.
Story first published: Tuesday, January 15, 2013, 13:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X