మారుతి 'డీజిల్' కార్ల ఎఫెక్ట్; అంచనాలకు మించి లాభాలు

By Ravi

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) గడచిన మార్చ్ 2013 నెలతో ముగిసిన చివరి త్రైమాసికంలో అంచనాలకు మించిన ఆర్థిక ఫలితాలను కంపెనీ నమోదు చేసింది. ఎమ్ఎస్ఐ తమ కంపెనీ చరిత్రలోలో ఇదివరకెన్నడూ లేనివిధంగా రూ. 1,147 కోట్ల నికర లాభాన్ని ఈ త్రైమాసికంలో ఆర్జించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికం కంపెనీ కేవలం రూ640 కోట్ల నికర లభాలను మాత్రమే ఆర్జించినట్లు ఎమ్ఎస్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

జనవరి-మార్చ్ 2012 త్రైమాసికపు నికర లాభంతో పోల్చుకుంటే జనవరి-మార్చ్ 2013 త్రైమాసికపు నికర లాభం 79 శాతం వృద్ధి చెందింది. మారుతి సుజుకి శుక్రవారం ఈ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించడంలో బిఎస్ఈలో షేరు ధర ఏకంగా 5.3% పెరిగి రూ. 1,673.50 వద్ద ముగిసింది. ఒక్క త్రైమాసికంలో ఇంత భారీ మొత్తంలో లాభాలను ఆర్జించడం ఇదే మొట్టమొదటి సారి అని కంపెనీ తెలిపింది.

కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన ఎర్టిగా, స్విఫ్ట్, డిజైర్ వంటి మోడళ్ల అమ్మకాలు పుంజుకోవడం, వ్యయాలను తగ్గించుకోవటం, సానుకూలంగా మారిన విదేశీ మారక రేట్లు వంటి పలు అంశాల వల్ల ఈ లాభాలను ఆర్జించగలిగామని మారుతి సుజుకి ఇండియా సీఎఫ్‌వో అజయ్ సేథ్ అన్నారు. ఈ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు కూడా 9 శాతనికి పైగా పెరిగి రూ. 12,567 కోట్లకు చేరాయని, గడచిన సంవత్సరంలో ఇవి రూ. 11,486 కోట్లుగా ఉన్నాయని ఆయన వివరించారు.

Maruti Profits
Most Read Articles

English summary
India's largest car maker, Maruti Suzuki Q4 profits exceeds expectations. The net profit for the March ending fourth quarter for FY-13 stood at Rs 1147.5 crore versus Rs 637.5 crore it registered for the same period last year. This is because largely on the back of higher sales of new models such as Ertiga, DZire and Swift, cost reduction and localisation efforts.
Story first published: Saturday, April 27, 2013, 7:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X