దీపావళి నాటికి మార్కెట్లోకి రానున్న ఆల్టో కె10 ఫేస్‌లిఫ్ట్!

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ఇటీవలే విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ మారుతి ఆల్టో 800 చిన్న కారుకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కంపెనీ అందిస్తున్న 1000సీసీ వెర్షన్ ఆల్టో (కె10)లో కూడా ఓ రిఫ్రెష్డ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు మారుతి సుజుకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీపావళి నాటికి ఈ కొత్త ఆల్టో కె10 విడుదలయ్యే అవకాశం ఉంది.

ఆల్టో 800 మాదిరిగానే ఆల్టో కె10లో కూడా డిజైన్, ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఆల్టో బ్రాండ్‌ను విస్తరించేందుకు తద్వారా ఈ బ్రాండ్ అమ్మకాలను పెంచుకునేందుకు ఆల్టో కె10 మోడల్‌ను 2010లో విడుదల చేశారు. ప్రత్యేకించి పెర్ఫామెన్స్ వెర్షన్ ఆల్టో కోరుకునే వారి కోసం ఈ వేరియంట్‌లో కె-సిరీస్ 1000సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

Alto K10 Front

ఆల్టో కె10 వేరియంట్లో అమర్చిన 1-లీటర్ కె-సిరీస్ ఇంజన్ గరిష్టంగా 6200 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన కేబుల్-టైప్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఆల్టో కె10 లీటరు పెట్రోలుకు 20.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.
Alto K10 Rear

ఆల్టో కె10 13.3 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. పవర్ స్టీరింగ్, రిమోట్ బూట్-లిడ్ ఓపెనర్, 4.6 మీటర్ల టర్నింగ్ రేడియస్, 160 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ప్రధాన ఫీచర్లు మారుతి ఆల్టో కె10 సొంతం. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఆల్టో కె10కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.
Most Read Articles

English summary
According to sources, India's largest carmaker Maruti Suzuki India may launch an upgraded Maruti Alto K10 soon. Stay tuned to telugu.drivespark.com for latest updates.
Story first published: Thursday, August 1, 2013, 15:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X