జూన్ 2013లో మారుతి సేల్స్ డౌన్, హ్యుందాయ్ సేల్స్ అప్

By Ravi

Car Sales
మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో గడచిన నెలలో కూడా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. జూన్ 2013 నెలలో దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు 12.6 శాతం క్షీణించి 84,455 యూనిట్లుగా నమోదయ్యాయి. జూన్ 2012లో ఇవి 96,597 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓప్రకటనలో పేర్కొంది.

ఈ సమయంలో కంపెనీ దేశీయ అమ్మకారు 7.8 శాతం తగ్గి 83,531 యూనిట్ల నుంచి 77,002 యూనిట్లకు పడిపోగా, ఎగుమతులు కూడా 43 శాతం క్షీణించి 13,066 యూనిట్ల నుంచి 7,453 యూనిట్లకు తగ్గాయి. మినీ కార్ సెగ్మెంట్లో (ఎమ్800, ఏ-స్టార్, ఆల్టో, వ్యాగన్ఆర్) అమ్మకాలు 8.4 శాతం క్షీణించి 34,198 యూనిట్ల నుంచి 31,314 యూనిట్లకు తగ్గాయి.

కాగా, కాంపాక్ట్ సెగ్మెంట్లో (ఎస్టిలో, స్విఫ్ట్, రిట్జ్) అమ్మకాలు 7.2 శాతం క్షీణించి 22,624 యూనిట్ల నుంచి 20,996 యూనిట్లకు పడిపోయాయి. డిజైర్ సెడాన్ అమ్మకాలు 8.7 శాతం తగ్గి 13,741 యూనిట్ల నుంచి 12,548 యూనిట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో మిడ్-సైడ్ సెడాన్ ఎస్ఎక్స్4 అమ్మకాలు 23 శాతం క్షీణించి 408 యూనిట్ల నుంచి 314 యూనిట్లకు పడిపోగా, గడచి నెలలో ఒక్క కిజాషి లగ్జరీ సెడాన్ కూడా అమ్ముడుపోలేదు.

1 శాతం పెరిగిన హ్యుందాయ్ అమ్మకాలు
జూన్ 2013లో దేశీయ ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ అమ్మకాలు 1 శాతం వృద్ధి చెందాయి. గడచిన సంవత్సరంలో ఇదే నెలతో పోల్చుకుంటే అమ్మకాలు 54,354 యూనిట్ల నుంచి 54,667 యూనిట్లకు పెరిగాయి. ఇదే సమయంలో దేశీయ అమ్మకాలు 30,450 యూనిట్ల నుంచి 30,610 యూనిట్లకు పెరగగా, ఎగుమతులు మాత్రం 23,904 యూనిట్ల నుంచి 24,057 యూనిట్లకు తగ్గాయి.

Most Read Articles

English summary
Maruti Suzuki India today reported 12.6 per cent decline in total sales in June this year at 84,455 units. Hyundai Motor India Ltd (HMIL) registered approx. 1 % growth in domestic sales for the month of June 2013.
Story first published: Monday, July 1, 2013, 13:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X