లీటరు డీజిల్‌కు 45.8 కి.మీ. మైలేజీనిచ్చిన స్విఫ్ట్ డిజైర్!

By Ravi

దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ 'స్విఫ్ట్ డిజైర్'ను టార్గెట్ చేస్తూ హోండా కార్స్ ఇండియా ప్రవేశపెట్టిన కాంపాక్ట్ సెడాన్ 'హోండా అమేజ్', భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న నేపథ్యంలో, మారుతి తమ ప్రోడక్ట్‌ను మార్కెటింగ్ చేసుకునేందుకు వివిధ మార్కెటింగ్ క్యాంపైన్‌లను నిర్వహిస్తోంది.

స్విఫ్ట్ డిజైర్ భారత మార్కెట్లో విడుదలై 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మారుతి సుజుకి గడచిన ఆదివారం దేశవ్యాప్తంగా 'డిజైరబుల్ మైలేజ్ ర్యాలీ'ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా 31 నగరాల్లో (ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్, వైజాగ్‌ల్లో) ఈ ర్యాలీని నిర్వహించామని, హైదరాబాద్‌లో తమ రీజనల్ మేనేజర్ ఓంకార్ నాథ్ ఈ ర్యాలీని ప్రారంభించారని కంపెనీ పేర్కొంది.

Maruti Suzuki DZire

ఈ క్యాంపైన్‌లో దాదాపు 62 మందికి పైగా డిజైర్ యజమానులు పాల్గొన్నారు. మైలేజ్‌లో స్విఫ్ట్ డిజైర్ సత్తా ఏంటో చూపించడమే ఈ క్యాంపైన్ యొక్క ప్రత్యేకత. సాధారణంగా ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 19.1 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్ వెర్షన్ లీటరుకు 23.4 కిలోమీటల్ మైలేజీనిస్తుంది.

అయితే, ఈ ర్యాలీలో పాల్గొన్న గురుదీప్ సింగ్ స్విఫ్ట్ డిజైర్ డీజిల్ కారు 45.8 కి.మీ. మైలేజీని ఇచ్చింది. అలాగే శ్రీరంగ్ చిండార్కర్ డిజైర్ పెట్రోల్ కారు 42.1 కి.మీ. మైలేజీనిచ్చింది. హైదరాబాద్‌లో సగటు మైలేజ్ డీజిల్ కార్లకు సంబంధించి 30.1 కి.మీ., విశాఖలో 39 కి.మీ.గా నమోదు కాగా, పెట్రోల్ కార్లకు సంబంధించి హైదరాబాద్‌లో 22.9 కి.మీ., విశాఖలో 46 కి.మీ. చొప్పున వచ్చిందని మారుతి సుజుకి పేర్కొంది.

Most Read Articles

English summary
Maruti Suzuki held the 'Dzirable Mileage Rally' in 31 cities across the country over the weekend in which over 62 Dzire owners participated. As the name clearly says, the purpose of the event was to demonstrate the Dzire's ‘incredible' mileage. Participants were provided with maps and were asked to follow a predefined route in and around cities.
Story first published: Tuesday, April 30, 2013, 15:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X