కొత్త 800సీసీ డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్న మారుతి

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, ఇప్పుడు చిన్న డీజిల్ ఇంజన్ అభివృద్ధి దృష్టి సారించింది. భారత మార్కెట్లో తక్కువ ధర కలిగిన కార్లకు గిరాకీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో, ఎంట్రీ లెవల్ కార్ సెగ్మెంట్లో తొలి డీజిల్ కారును విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే 800సీసీ డీజిల్ ఇంజన్‌ను మారుతి అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో లభ్యమవుతున్న అతిచిన్న డీజిల్ ఇంజన్ కలిగిన కారు 'చెవర్లే బీట్'. ఈ కారులో 1000సీసీ (1.0 లీటర్) డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా లీటరుకు 25 కిలోమీటర్లకు పైగా మైలేజీనిస్తుంది. తక్కువ సామర్థ్యం కలిగిన డీజిల్ కార్లు ఎక్కువ మైలేజీనిస్తాయి. భారత మార్కెట్లోని బడ్జెట్ కార్ కొనుగోలుదారులు ప్రధానంగా మైలేజ్, ధర, బ్రాండ్‌లకే ప్రాధాన్యత ఇస్తారు.


ఈ నేపథ్యంలో, ఎంట్రీ లెవల్ డీజిల్ కార్ సెగ్మెంట్లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. మారుతి సుజుకి అభివృద్ధి చేస్తున్న వైఎల్7 అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న గ్లోబల్ స్మాల్ కారులో ఉపయోగించనున్నారు. మన అదృష్టం బాగుంటే, వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఈ చిన్న డీజిల్ కారును చూసే అవకాశం ఉంటుంది.

వచ్చే ఏడాది ద్వితీయార్థంలో వైఎల్7 కాంపాక్ట్ డీజిల్ కారును భారత ప్లాంటులోనే మారుతి సుజుకి ఉత్పత్తి చేసే ఆస్కారం ఉంది. పూర్తిగా భారత్‌లో ఉత్పత్తి చేసిన కారును ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, మారుతి అభివృద్ది చేస్తున్న ఈ చిన్న డీజిల్ ఇంజన్ లీటరుకు 30 కిలోమీటర్లకు మైలేజీని ఇవ్వొచ్చని అంచనా.

Diesel Engine

ఇదే గనుక నిజమైతే భారత మార్కెట్లో లభ్యమవుతున్న అత్యధిక మైలేజీనిచ్చే డీజిల్ కారుగా మారుతి సుజుకి రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం ఈ రికార్డును సాధించిన చిన్న డీజిల్ కారుగా చెవర్లే బీట్ ఉంది. ఇదిలా ఉండగా, మరొక దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కూడా చిన్న డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. కంపెనీ అందిస్తున్న టాటా నానో కారులో ఈ చిన్న డీజిల్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే టాటా నానో డీజిల్ మార్కెట్లో విడుదలయ్యే సూచనలున్నాయి.
Most Read Articles

English summary
According to the Financial Express though, Maruti Suzuki is already well on its way into offering India's smallest diesel engine till date. Citing its sources, FE states that an 800cc diesel engine will power the company's upcoming global small car, codenamed YL7.
Story first published: Tuesday, August 6, 2013, 16:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X