స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలను మింగేసిన డిజైర్ సెడాన్

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు అనగానే మనకు టక్కున గుర్తుకువచ్చేవి ఆల్టో, స్విఫ్ట్ మాత్రమే. అయితే, ఇప్పుడు స్విఫ్ట్ స్థానంలో డిజైర్ పేరు వినిపించనుంది. గడచిన ఏప్రిల్ 2013 నెలలో మారుతి సుజుకి మొత్తం 19,446 స్విఫ్ట్ డిజైర్ సెడాన్ కార్లను విక్రయించింది. ఇదే సమయంలో అమ్ముడైన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలతో పోల్చుకుంటే డిజైర్ అమ్మకాలు 2,916 యూనిట్లు అధికమని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

అంతేకాదండోయ్, ఇదే నెలలో మారుతి సుజుకి ముద్దుబిడ్డ ఆల్టో కారు అమ్మకాలతో పోల్చుకుంటే డిజైర్ అమ్మకాలు కేవలం 401 యూనిట్లు మాత్రమే తక్కువ. దీంతో ప్రస్తుతం తమ మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో స్విఫ్ట్ డిజైర్ రెండవ స్థానంలో నిలిచింది. గడచిన ఫిబ్రవరి 2012లో మారుతి సుజుకి అప్‌డేట్ చేయబడిన సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మారుతి సుజుకి సుమారు 2 లక్షలకు పైగా స్విఫ్ట్ డిజైర్లను విక్రయించింది.

కాంపాక్ట్ డిజైన్, స్టయిలిష్ లుక్, మెరుగైన మైలేజ్, విశ్వసనీయమైన బ్రాండ్ తదితర అంశాలు స్విఫ్ట్ డిజైర్‌ సక్సెస్‌కు అండగా నిలిచాయి. తమ స్విఫ్ట్ డిజైర్ హ్యాచ్‌బ్యాక్ ధరకే సెడాన్ ఫీచర్లను అందిస్తుందని మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ తెలిపారు.

Maruti Swift DZire
Most Read Articles

English summary
Maruti Swift DZire becomes now India's No.2 selling car. Maruti Suzuki has sold 19,446 units of the Swift DZire which is just 401 cars shy of the bestselling Alto 800 in April 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X