జులైన 11న మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ డీజిల్ విడుదల

By Ravi

లగ్జరీ కార్ ప్రియులను ఆకర్షించేందుకు జులై నెలలో సరికొత్త మోడళ్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. తక్కువ ధర కలిగిన లగ్జరీ కార్లకు ఇప్పుడు డిమాండ్ జోరుగా ఉండటంతో, జర్మన్ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో మార్కెట్లో ప్రవేశపెట్టిన బి-క్లాస్ మోడల్‌లో తాజాగా డీజిల్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జులై 11న డీజిల్ వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్‌ను భారత మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.

డీజిల్ వెర్షన్ బి-క్లాస్ లగ్జరీ కారులో 2.2 లీటర్, ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. కంపెనీ ఇటీవలే ప్రవేశపెట్టిన ఏ-క్లాస్ కారులో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. బేస్ వేరియంట్లో సన్‌రూఫ్ ఉండబోదని తెలుస్తోంది. అలాగే 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ స్థానంలో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. పెట్రోల్ వెర్షన్ ధర కన్నా ఇది రూ.60,000 నుంచి రూ.80,000 తక్కువగా ఉండనుంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పెట్రోల్ వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 1.6 లీటర్ (1595సీసీ) 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 122 హెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 10.2 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. బి-క్లాస్ పెట్రోల్ గరిష్టంగా 190 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Mercedes Benz B Class
Most Read Articles

English summary
Mercedes Benz India will be launching the B Class in the diesel avatar on the July 11, 2013. The car will be powered by a 2.2-litre four cylinder diesel engine mated to a 7-speed dual clutch gearbox.
Story first published: Tuesday, July 2, 2013, 14:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X