జనవరి 14 నుంచి పెరగనున్న మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు

కార్ కంపెనీలు ఈ పండుగ సీజన్‌లో ఉత్పత్తుల ధరలను తగ్గించడానికి బదులు, ధరలను భారీగా పెంచుతూ కొనుగోలుదారుల వెన్ను విరుస్తున్నారు. జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి ఈ పెంపు 1 నుంచి 3 శాతం మధ్యలో ఉంటుంది. పెరుగుతున్న ఉత్పాదక వ్యయం, అధిక వడ్డీ రేట్లు, రూపాయి పతనం వంటి కారణాల వలన తమపై ఒత్తిడి పెరుగుతుండటం వలన ధరలు పెంచక తప్పడం లేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎబెర్హర్డ్‌ కెర్న్‌ తెలిపారు. పెంచిన ధరలు జనవరి 14 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన వివరించారు.

6 శాతం వరకూ పెరిగిన బిఎమ్‌డబ్ల్యూ కార్ల ధరలు
ఇదిలా ఉండగా మరొక జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా కూడా తమ ఉత్పత్తుల ధరలను 5 నుంచి 6 శాతం వరకూ పెంచామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ తాజా పెంపు జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చిందని కంపెనీ తెలిపింది. బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ కార్ల ధరలను కూడా పెంచామని కంపెనీ వివరించింది. ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ దేశీయ విపణిలో అందిస్తున్న కార్ల ధరలు రూ.25.50 లక్షల నుంచి రూ.1.42 కోట్ల రేంజ్‌లో ఉండగా, మినీ బ్రాండ్ కార్ల ధరలు రూ.26.60 లక్షల నుంచి రూ.37.50 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

Mercedes Benz

3.69 లక్షల వరకూ పెరిగిన ఆడి కార్ల ధరలు
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా దేశీయ విణిలో అందిస్తున్న అన్ని కార్ల ధరలు మోడళ్లను బట్టి రూ.59,000 నుంచి రూ.3,69,000 రేంజ్‌లో (1 నుంచి 3 శాతం రేంజ్‌లో) పెంచుతున్నట్లు ఇదివరకే ఓ ప్రకటనలో తెలిపింది. తాము గతంలో చెప్పినట్లుగానే, మార్కెట్ పరిస్థితులు సవాలుగా మారాయని, పెరిగిన ఉత్పాదక వ్యయం, పతనమవుతున్న రూపాయి మారకపు విలువ, నిరంతరాయంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ధరలకు పెంచక తప్పడం లేదని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెష్కీ వ్యాఖ్యానించారు
Most Read Articles

English summary
German luxury carmaker Mercedes-Benz India will hike prices of its entire model range by one to three per cent effective January 14, 2013. The price of the B-Class luxury hatchback will be increased by one per cent, prices of the C-Class and E-Class sedans will be upped by 1.5 per cent, while the S-Class luxury limousine’s price will go up by three per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X