ఏ-క్లాస్‌కు అద్దిరిపోయే రెస్పాన్స్; పది రోజుల్లోనే 400 బుకింగ్స్

By Ravi

జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు 'ఏ-క్లాస్' దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఇది కేవలం రూ.21.93 లక్షల ప్రారంభ ధరకే లభిస్తుండటంతో ఈ మోడల్‌ను సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ మార్కెట్లోకి విడుదలైన 10 రోజుల సమయంలోనే, ఈ చిన్న లగ్జరీ కారుకు 400 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి.

ఈ స్పందన చూస్తుంటే, ఏ-క్లాస్ కూడా మెర్సిడెస్ బెంజ్ నుంచి ఓ సక్సెస్‌‌ఫుల్ మోడల్‌గా నిలిచిపోయే ఆస్కారం ఉంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ ఏ-క్లాస్ కారును జున్ 30, 2013న భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. దేశీయ విపణిలో మెర్సిడెస్ బెంజ్ నుంచి లభిస్తున్న అత్యంత చవక కారు కూడా ఇదే. భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఏ 180 సిడిఐ (డీజిల్) ధర రూ. 21.93 లక్షలుగా ఉండగా, మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఏ 180 స్పోర్ట్ (పెట్రోల్) ధర రూ.22.73 లక్షలుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై) ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఏ 180 స్పోర్ట్ వేరియంట్‌లో 1.6 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 122 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఏ 180 సిడిఐ వేరియంట్‌లో 2.2 లీటర్, 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 109 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 7జి-డిసిటి 7 స్పీడ్ డ్యూయెల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటాయి. ఏ 180 సిడిఐ డీజిల్ వేరియంట్ లీటరుకు 20.06 కి.మీ. మైలేజీని, ఏ 180 స్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 15.50 కి.మీ. మైలేజీనిస్తాయి.

Mercedes Benz A Class
Most Read Articles

English summary
German Luxury car maker Mercedes Benz India has received 400 bookings for its recently launched small premium car A Class in just 10 days of the launch.
Story first published: Tuesday, June 11, 2013, 11:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X