కస్టమర్ల కోసం హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసిన మెర్సిడెస్ బెంజ్

By Ravi

పిండి కొద్దీ రొట్టె అన్న చందంగా, డబ్బు కొద్దీ విలాసాలు లభిస్తాయి. భారత లగ్జరీ కార్ మార్కెట్లోనే తొలిసారిగా, జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ తమ లగ్జరీ కస్టమర్ల కోసం పూనే ప్లాంటులో ఓ హెలిప్యాడ్‌ను నిర్మించింది. కంపెనీ అందిస్తున్న ఏఎమ్‌జి మోడళ్లను కొనుగోలు చేసే హై ప్రొఫైల్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని, వారిని హెలికాఫ్టర్‌లో తరలించేందుకు ఈ హెలిప్యాడ్‌ను నిర్మించారు.

మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇటీవల భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన కొత్త 2014 ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి విడుదల సందర్భంగా, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎబర్‌హార్డ్ కెర్న్ వెల్లడించారు. పటిష్టమైన ఏఎమ్‌జి కొనుగోలుదారులను నేరుగా హెలిప్యాడ్ ద్వారా ప్రత్యేకంగా హై ఎండ్ మెర్సిడెస్ మోడళ్లు, ఏఎమ్‌జి మోడళ్లను ఉంచే ప్రాంతానికి తీసుకువెళ్లనున్నారు.

Mercedes Benz India Builds Helipad In Pune Factory To Ferry Customers

మెర్సిడెస్ బెంజ్ గడచిన మూడేళ్ల క్రింత ఏఎమ్‌జి బ్రాండెడ్ పెర్ఫామెన్స్ వాహనాలను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు భారత్‌లో సుమారు 200 యూనిట్లకు పైగా ఏఎమ్‌జి బ్రాండెడ్ కార్లను విక్రయించారు. ప్రస్తుతానికి తాము లక్ష్యంగా చేసుకున్న ఈ గ్రూప్ చిన్నదే అయినప్పటికీ, ఇది క్రమంగా వృద్ధి చెందుతోందని, భారత్‌లో హై పెర్ఫామెన్స్ కార్లకు గిరాకీ పెరుగుతోందని కెర్న్ చెప్పారు.

పూనేలో తాము ఏర్పాటు చేసిన ఈ హెలిప్యాడ్, స్వతగాహా హెలికాఫ్టర్లను కలిగిన ఉన్న కస్టమర్లు తమ స్వంత హెలికాఫ్టర్లలో వచ్చేందుకు వీలుగా ఉండేలా కూడా ఉపయోగపడుతుందని కెర్న్ వివరించారు. ప్రారంభంలో భాగంగా, కస్టమర్ల కోసం హెలికాఫ్టర్ విజిట్లను తొలత ముంబైలో ప్రారంభించనున్నారు. అనంతరం ఈ సౌకర్యాన్ని దేశంలోని ఇతర నగరాలకు విస్తరించనున్నారు.

Most Read Articles

English summary
In a first for any luxury car maker in India, Mercedes-Benz has built a helipad within its factory premises in Pune. The helipad will be used to ferry customers in and out and has been specially built keeping in mind high profile buyers of the brand's AMG models.
Story first published: Wednesday, December 4, 2013, 10:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X