ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్ ఉత్పత్తి భారత్‌లోనే

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, గడచిన మే నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్ ఎస్‌యూవీని ఇప్పుడు స్థానికంగా భారత్‌లోనే అసెంబ్లింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. పూనేలో ఉన్న ఛాకన్ ప్లాంటులో ఈ లగ్జరీ ఎస్‌యూవీని సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్లుగా దిగుమతి చేసుకొని అసెంబ్లిగ్ చేస్తున్నామని, ఆగస్ట్ 26, 2013న పూర్తిగా స్థానికంగా తయారైన జిఎల్-క్లాస్‌ను విడుదల చేస్తామని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది.

అమెరికాలోని టుస్కలూసాలో ఉన్న మెర్సిడెస్ మాతృప్లాంట్ తర్వాత జిఎల్ క్లాస్ ఎస్‌యూవీని స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న మొదటి దేశం ఇండియా కావటం విశేషం. మెర్సిడెస్ బెంజ్ జిఎల్-క్లాస్ ఎస్‌యూవీని స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో, దీని ధర మరింత అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ లగ్జరీ ఎస్‌యూవీ ధర రూ.77.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది జిఎల్350 సిడిఐ డీజిల్ వేరియంట్లో లభిస్తుంది.


మెర్సిడెస్ బెంజ్ జిల్-క్లాస్ ఎస్‌యూవీ విషయానికి వస్తే..
ఇందులో బోల్డ్ గ్రిల్, ఎస్ఎల్ క్లాస్ నుంచి స్ఫూర్తి పొందిన డేటైమ్ ఎల్ఈడి రన్నింగ్ ల్యాంప్స్, ప్రీమియం లెథర్ ఇంటీరియర్స్, వుడ్ ఫినిషింగ్ ఇంటీరియర్లు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. కంపెనీ అందిస్తున్న ఎమ్ఎల్ క్లాస్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త జిఎల్ క్లాస్‌ను అభివృద్ధి చేశారు. ఇదివరకటి తరం జిఎల్ క్లాస్‌తో పోల్చుకుంటే ఈ 2013 జిఎల్ క్లాస్ మరింత విశాలవంతంగా ఉంటుంది.

ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీలో 3.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 260 పిఎస్‌ల శక్తిని, 620 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. 2013 మెర్సిడెస్ బెంజ్ కేవలం 10 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Mercedes Benz
Most Read Articles

English summary
Germany based luxury carmaker Mercedes Benz India will roll out the first locally manufactured GL-Class SUV from its Chakan plant in Pune on August 26, 2013. Powered by 3.0 litre diesel engine which has a max power output of 260 PS and a peak torque figure of 620Nm. This engine is mated to a dual clutch 7-speed automatic gearbox and the car can run 0-100 kmph in less than 10 seconds.
Story first published: Tuesday, August 13, 2013, 10:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X