2014లో డీజిల్ ఇంజన్‌తో రానున్న మిత్సుబిషి అవుట్‌లాండర్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి ఇండియా, దేశీయ మార్కెట్లో నిలిపివేసిన అవుట్‌లాండర్ ప్రీమియం ఎస్‌యూవీ అమ్మకాలను వచ్చే ఏడాది తిరిగి కొనసాగించనుంది. కొత్త డీజిల్ ఇంజన్‌తో అప్‌గ్రేడ్ చేసిన అధునాతన అవుట్‌లాండర్ ఎస్‌యూవీని మిత్సుబిషి 2014లో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు,

భారత మార్కెట్లో అమ్మకాలు బలహీనంగా ఉండటంతో మిత్సుబిషి ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న సెడియా స్పోర్ట్స్, ఇవల్యూషన్ ఎక్స్ మరియు పెట్రోల్ వెర్షన్ అవుట్‌లాండర్ అమ్మకాలను నిలిపివేసిన సంగతి తెలిసినదే. హిందుస్థాన్ మోటార్స్ సీఓఓ పి విజయన్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవుట్‌లాండర్‌ను 2014లో డీజిల్ ఇంజన్‌తో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

Mitsubishi Outlander

2014లో రానున్న ఈ కొత్త డీజిల్ పవర్డ్ అవుట్‌లాండర్ ఎస్‌యూవీ 3వ తరానికి చెందినది. గతేడాదే ఈ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లోల విడుదల చేశారు. ప్రీమియం ఇంటీరియర్లతో పాటుగా అనేక కొత్త ఫీచర్లతో ఈ కారును విక్రయిస్తున్నారు.

ఇంజన్ విషయానికి వస్తే, 2014 అవుట్‌లాండ్ డీజిల్‌లో 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 147 హార్స్ పవర్‌ల శక్తిని, 380 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేసుకునే వెసలుబాటు ఉంటుంది.

Mitsubishi Outlander SUV

గతంలో మిత్సుబిషి తమ 2వ తరం అవుట్‌‌లాండర్‌ను భారత్‌కు సిబియూ రూట్లో దిగుమతి చేసుకొని విక్రయించేది. అయితే, హిందుస్థాన్ మోటార్స్‌తో మిత్సుబిషి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఇప్పుడు ఈ ఎస్‌యూవీని హిందుస్థాన్ మోటార్స్‌కు చెందిన చెన్నైలో తిరువల్లూర్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. 2014 అవుట్‌లాండర్ డీజిల్ విడుదలైన తర్వాత ఇది పాజెరో స్పోర్ట్, మోంటెరో ఎస్‌యూవీల సరసన ఇది కూడా నిలువనుంది.
Most Read Articles

English summary
The diesel Outlander that will return in 2014 will be the 3rd gen model that was launched last year internationally. This also means the SUV will now offer several new features, as well as a more premium interior.
Story first published: Friday, August 16, 2013, 13:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X