మరోసారి షేపులు మార్చుకోనున్న మిత్సుబిషి పాజెరో స్పోర్ట్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి అందిస్తున్న రఫ్ అండ్ టఫ్ ఎస్‌యూవీ 'పాజెరో స్పోర్ట్'లో కంపెనీ ఓ నెక్స్ట్ జనరేషన్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పాజెరో స్పోర్ట్ కన్నా మరింత మెరుగ్గా, స్టయిలిష్‌గా ఉండేలా మిత్సుబిషి తమ పాపులస్ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేస్తుంది.

మిత్సుబిషికి అటు గ్లోబల్ మార్కెట్లోను, ఇటు ఇండియన్ మార్కెట్లో అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, తిరిగి తమ మార్కెట్ వాటాను దక్కించుకొని, మార్కెట్లో హవా కొనసాగించేందుకు గాను మిత్సుబిషి రానున్న మూడేళ్లకు సరిపడా భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది.

ఈ ప్రణాళికలో భాగంగానే, మిత్సుబిషి కొత్త యుటిలిటీ వాహనాలను, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకుంది. ఇందులో సరికొత్త పాజెరో స్పోర్ట్ ఎస్‌యూవీ కూడా ఉంది. ఈ నెక్స్ట్ జనరేషన్ పాజెరో స్పోర్ట్ కోసం కొత్త ట్రైటన్ పికప్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం.

Mitsubishi Pajero Sport

భారత్‌లో గడచిన కొద్ది కాలంగా ఎక్కువగా అమ్ముడుపోతున్న మిత్సుబిషి మోడల్ పాజెరో స్పోర్ట్ మాత్రమే. హిందుస్థాన్ మోటార్స్‌తో మిత్సుబిషి కంపెనీకి భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో, ఈ నెక్స్ట్ జనరేషన్ పాజెరో స్పోర్ట్ ఇండియాకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

ప్రస్తతం మార్కెట్లో లభిస్తున్న పాజెరో స్పోర్ట్ ఎస్‌యూవీలో 2.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 178 బిహెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో కూడిన ఈ ఎస్‌యూవీ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, నెక్స్ట్ జనరేషన్ పాజెరో స్పోర్ట్ ఇదే ఇంజన్‌‌ను ఉపయగిస్తారా లేక అప్‌గ్రేడెడ్ ఇంజన్‌ను ఉపయోగిస్తారా అనే అంశం తేలాల్సి ఉంది. అయితే, ఈ కొత్త పాజెరో స్పోర్ట్‌ను చూడాలంటే 2015 వరకు వేచి ఉండక తప్పదు.

Most Read Articles

English summary
Mitsubishi, the Japanese automaker is facing slow sales globally and in India. In a bid to regain its foothold, it has announced the next three years plan that includes utility vehicles and electric cars which includes an all-new Pajero Sport SUV in 2015.
Story first published: Tuesday, November 12, 2013, 11:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X